నీరులేక ఎండుతున్న బత్తాయి తోటలు

ABN , First Publish Date - 2022-05-25T05:52:33+05:30 IST

మండలంలోని బత్తాయి తోటలు సాగు రోజురోజుకు ఎడుముఖం పడుతున్నాయి. బత్తాయి సాగు చేసిన రైతులు అప్పులు ఊబిలో కురుకుపోయిన్నారు.

నీరులేక ఎండుతున్న బత్తాయి తోటలు
ఎండ్రపల్లిలో నీరులేక ఎండుముఖం పడుతున్న బత్తాయితోట

కనుమరుగవుతున్న తోటలు

నష్టల ఊబిలోకి  రైతన్నలు

పుల్లలచెరువు, మే 24:  మండలంలోని బత్తాయి తోటలు సాగు రోజురోజుకు ఎడుముఖం పడుతున్నాయి. బత్తాయి సాగు చేసిన రైతులు అప్పులు ఊబిలో కురుకుపోయిన్నారు. దీంతో   తోటల సాగుకు రైతన్నలు దూరం అ వుతున్నారు. బత్తాయి తోటలు సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడం లేదు. గత పదిహేనేళ్లలో పుల్లలచెరువు మండలంలో సక్రమంగా వర్షం కురవకపోవడం, కరువు సంభవించినప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు సాగు దూరం అవుతున్నారు.

ఇంచుమించు పదేళ్ల క్రితం మండలంలో 1000 హెక్టార్లలో బత్తాయి తోటల సాగులో ఉండేవి. కాని అప్పటి నుంచి ఏటా వేసవిలో భూగర్భ జలాలు అడుగంటడంతో నీరు అందక  ప్రతి సంవత్సరం సాగు తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం పుల్లలచెరువు మండలంలో 150 హెక్టార్లలో మాత్రమే బత్తాయి సాగు అవుతున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. మండలంలో ప్రతి ఏటా సాధారణ వర్షపాతం కన్న 30 శాతం తక్కువ వర్షం నమోదు కావడంతో కరువు తీవ్ర రూపం  దాలుస్తోంది. దీంతో రైతుల బోరు బావుల్లో భూగర్భ జలాలు 800 అడుగులకు చేరి నీరు రావడం లేదు.  దీంతో పలువురు రైతులు బత్తాయి తోటలను వదిలేస్తున్నారు. అయితే 2011వ సంవత్సరంలో కరువు వచ్చినప్పుడు 150 హెక్టార్లలో పంట ఎండిపోయింది. వరుస కరువులతో  ఉన్న కొద్దిపాటి తోటలు కూడా  ఏటా కనుమరుగు అవుతున్నాయి. దీంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతు న్నారు. అధికారులు ఎండిపోయిన బత్తాయి తోటలను పరిశీలించి నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదికలు పంపించిన ప్రభుత్వం నుంచి ఏటువంటి నష్ట పరిహారం అందలేదు. మండలంలోని కోమరోలు, కుందంపల్లి ,రచకొండ,పాతచెరువుతాండ, రెంటపల్లి, అయ్యగానిపల్లె, చెన్నంపల్లి, కవలకుంట్ల, నాయుడుపాలెం, శతకోడు, గంగవరం, మర్రీవేముల, యండ్రపల్లి, మల్లాపాలెం గ్రామాల్లో బోర్లలో నీళ్లు రాక 80 శాతం వరకు బత్తాయి తోటలు కనుమరుగయ్యాయి. ఇప్పటికైనా  ప్రభుత్వం స్పందించి  వున్న బత్తాయి తోటలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరాఫరా చేసి నష్టపోయిన రైతులను ఆదుకోని తోటల సాగు పెంచేందుకు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2022-05-25T05:52:33+05:30 IST