ఇంటింటా కనిపించని కుళాయి

ABN , First Publish Date - 2022-09-19T04:53:43+05:30 IST

ప్రజలకు రక్షిత నీరు అందించాలనే ఉద్దేశంతో ఇంటింటా కుళాయి కనెక్షన్‌ ఇవ్వడానికి మండలంలో జలజీవన్‌ పేరిట పనులు చేపట్టారు.

ఇంటింటా కనిపించని కుళాయి

నత్తనడకన జలజీవన్‌ మిషన్‌ పనులు


నరసాపురం రూరల్‌, సెప్టెంబరు 18: ప్రజలకు రక్షిత నీరు అందించాలనే ఉద్దేశంతో ఇంటింటా కుళాయి కనెక్షన్‌ ఇవ్వడానికి మండలంలో జలజీవన్‌ పేరిట పనులు చేపట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ 13.75 కోట్లతో పను లను ప్రతిపాదించారు. ఇప్పటి వరకు 14 పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 40 పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

తీర ప్రాంతంలో భారీ మంచినీటి ప్రాజెక్టులు ఉన్నా ప్రజలకు సురక్షిత నీరు సరఫరా చేయలేకపోతున్నారు. ప్రాజెక్టుల నుంచి కలుషితమైన నీరు రావడంతో చాలా మంది పట్టణంలోని వాటర్‌వర్స్స్‌, గ్రామాల్లోని వాటర్‌ ప్లాంట్‌ నీరు వాడుకుంటున్నారు. జలజీవన్‌ పథకంలో కేంద్రం 45శాతం, రాష్ట్ర ప్రభుత్వం 45శాతం, మిగిలిన పది శాతాన్ని లబ్ధిదారులు చెల్లించడం ద్వారా ప్రతి ఇంటికి కూళాయి కనెక్షన్‌ ఇవ్వాలనేది లక్ష్యం.

మండలంలోని 28 గ్రామాల్లోని 9121 మందికి ఇంటింటా కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఏడాది ఆరంభంలో పనులకు శంకుస్థాపన చేశారు. అశించిన స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. రూ 13 కోట్లతో 75 పనులకు ఇప్పటి వరకు 58 పనులకు టెండర్లు పూర్తయ్యాయి. 40 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందులో 14 పనులు మాత్రమే పూర్తయ్యాయి. గ్రామాల్లో చేపడుతున్న పనులన్ని తాత్కాలికమే. చేపట్టిన పనులు సక్రమంగా ఉండి నీరందిస్తే మళ్లీ రెగ్యులర్‌ పనులు చేపట్టనున్నారు. గ్రామాల్లో చేపట్టిన పనులకు బిల్లులు వస్తాయా లే సందేహం కాంట్రాక్టర్లను పీడిస్తోంది. కొన్ని పనులకు నిధులు మంజూరు కాకపోవడంతో మిగిలిన పనులకు బిల్లులపై ఆందోళనపతో ఉన్నారు. ఈకారణంగానే జలజీవన్‌ మిషన్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై అర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ బుజ్జేశ్వరరావు ను వివరణ కోరగా మూడు నెలల నుంచి వర్షాలు, వరదల కారణంగా పనులు జాప్యమయ్యాయన్నారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-09-19T04:53:43+05:30 IST