చివరి ఆయకట్టు వరకు నీరందించాలి

ABN , First Publish Date - 2021-04-18T05:59:36+05:30 IST

నిర్మల్‌ జిల్లాలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టు సరస్వతి కెనాల్‌ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలాచర్యలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

చివరి ఆయకట్టు వరకు నీరందించాలి

తాగు, సాగునీటి సరఫరా అధికారులతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : నిర్మల్‌ జిల్లాలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టు సరస్వతి కెనాల్‌ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలాచర్యలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం శాస్ర్తినగర్‌లోని తన నివాసంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యూ ఎస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సరస్వతి కాలువ నుంచి చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదని పెంబి మండల రైతులు మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో ఈ విషయంపై చర్చించారు. సరస్వతి కాలువపై గాంధీనగర్‌ సమీపంలో ఆనకట్ట నిర్మించి తాగు నీటికి సాగునీటిని మళ్లించడం వల్ల 1500 క్యూసెక్యులకు గాను 1000 క్యూసెక్యుల సాగునీటినే రైతులకు అందించ గలుగుతున్నామని ఆ శాఖ అధికారులు మంత్రికి వివరించారు. ఆనకట్టను తొలగించి దానికి బదులు క్రాస్‌ రెగ్యులేటరీని నిర్మిస్తే తాగు, సాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని మంత్రి దృష్టికి తెచ్చారు. క్రాస్‌ రెగ్యులేటరీ నిర్మాణానికి సుమారు కోటి రూపాయల అంచనా వ్యయం అవుతుందని అధికారులు తెలిపారు. దీనికి సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని, నిధు లు మంజూరుకు తనవంతు కృషి చేస్తానని మంత్రి తెలిపారు. ఆవాసాలకు, వ్యవసాయానికి నిరంతరాయంగా తాగు,సాగునీటి సరఫరా చేయడం తెలం గాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. నీరందని ప్రాంతాలకు నీరు అందించేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఈ సమా వేశంలో మాజీ డీసీసీబీ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ సుశీల్‌ కుమా ర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, ఈఈ రామారావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-18T05:59:36+05:30 IST