Abn logo
Oct 1 2020 @ 08:55AM

కాంట్రాక్టర్‌ కోసం.. ముంచేశారు..

Kaakateeya

వరద తగ్గినా వెనక్కుపోని నీరు

ఇసుక కోసం వేసిన రోడ్డే కారణం

రైతుల గోడు పట్టించుకోని అధికారులు

400 ఎకరాల్లో వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం

బ్రిటీష్‌ కాలం నుంచి ఉన్న నక్కపాయ పూడ్చివేత


తెనాలి/గుంటూరు(ఆంధ్రజ్యోతి): కృష్ణమ్మ ఒక్క రోజులోనే శాంతిం చింది. రైతులు, తీర ప్రాంత గ్రామాల్లోని ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. అయితే పొలాల్లో నిలిచిన కృష్ణమ్మ కదలనంటోంది. ఇసుక కాంట్రాక్టర్లు.. వారికి ఒత్తాసు పలుకుతున్న అధి కారుల వైఖరి రైతుల పాలిట శాపంగా మారింది. చేతి కందే దశలో ఉన్నవి.. రూ.లక్షలు వెచ్చించి సాగు చేసిన పంటలు నీటి పాలవు తున్నాయని రైతులు మొరపెట్టుకుం టే, కాంట్రాక్టర్‌ అంత ఖర్చుపెట్టుకుని వేసిన రోడ్డుకు గండి ఎలా పెడతారంటూ అధికారులు ఎదురు ప్రశ్నించారు. రైతులకు అండగా ఉండాల్సిన అధికారులే కాంట్రాక్టర్‌ క్షేమం చూడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


వరద తగ్గింది. పంటలు దక్కినట్టే.. అని రైతులు ఊపిరి పీల్చుకుంటే, వారి కాయకష్టానికి ఇసుక కోసం కాంట్రాక్టర్‌ వేసిన రోడ్డు శాపంగా మారింది. వరద నీరు చేలల్లో నుంచి బయటకు పోయేందుకు బ్రిటీష్‌ కాలం నుంచి ఉన్న నక్క పాయను పూడ్చేసి మరీ రోడ్డేశారు. కృష్ణా కుడి కరకట్టకు అనుకుని ఎగువ నుంచి నక్కపాయ అనే కాలువ వంటిది ఉండేది. సంవత్సరం క్రితం వరద సమయంలో ఇదే రోడ్డు అడ్డుగా ఉండటంతో రైతులు గాడికొట్టేశారు. అప్పుడు ఇటుక వ్యాపారులు గండి కొట్టనివ్వకుండా అడ్డుతగలినా, అప్పట్లో తహసీల్దారు రైతులకే మద్దతిచ్చారు. ప్రస్తుతం పెదలంక దగ్గర ఇసుక తవ్వుకునేందుకు అనుమతిలేకున్నా కాంట్రాక్టర్‌ చేల మధ్యగా రోడ్డు వేసుకున్నారు.


నక్కపాయ దగ్గర కనీసం తూములు ఏర్పా టు చేయకుండా పూర్తిగా పూడ్చేశారు. అప్పట్లో రైతుల అభ్యంత రాలను పట్టించుకోలేదు. రైతులు ఆందోళన చెందినట్లుగానే ప్రస్తుతం వరద రావటంతో సమస్య ఉత్పన్నమైంది. ఈపూరు-కొల్లూరు మధ్య ఉన్న సుమారు 400 ఎకరాల్లోని పసుపు, కంద, మినుము, అరటి, తమలపాకు చేలు వరద నీటిలోనే మునిగాయి. పసుపు చేలల్లో నీరు రెండో రోజు పోయినా కొంత పంటైనా దక్కేది. అయితే వరద నీరు నాలుగు రోజులుగా నిల్వ ఉండటంతో పంట పాడైపోతుందనే ఆందోళనతో కొందరు రైతులు వ్యయ ప్రయాసలకు ఓర్చి ఇంజన్లతో నీటిని కృష్ణా పశ్చిమ బ్యాంక్‌ కెనాల్‌లోకి మళ్లించుకుంటున్నారు. ఈ నీటి ప్రవాహం వల్ల కరకట్ట కోతపడి భవిష్యత్‌లో ప్రమాదకర పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. కంద, అరటి నేలవాలుతోంది. మినుము పంట నీటిలోనే తేలుతుంది. 

 

వరద నీటిలోనే.. పంటలు

భట్టిప్రోలు, అచ్చంపేట, దాచేపల్లి, దుగ్గి రాల: కృష్ణానదికి భారీగా వచ్చిన వరద తగ్గుముఖం పట్టినప్పటికి పలు గ్రామాల్లో పంట పొలాల్లోనే వరద నీరు తిష్టవేసింది. వాణిజ్య పంటలు, కూరగాయ పంటలు నీటిలోనే నానుతున్నాయి. భట్టిప్రోలు మం డలంలోని లంక గ్రామాల రైతులు నీటి లోని పంటలను చూసి కన్నీరుపెడుతున్నారు. పసుపు, కంద, అరటి, బొప్పా యి, తమలపాకు, కూరగాయ తోటల్లో నిలిచిన వరద నీటిని బయటకు పంపేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  వరద ఉధృతికి పెదలంక - పెసర్లంక, ఓ లేరు - పెసర్లంక ప్రధాన రహదార్లకు గం డ్లు ఏర్పడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లోని గృ హాల చుట్టూ ఉన్న వరద నీరు దుర్గంధం వెదజల్లుతుంది. అచ్చంపేట మండలంలో 350 హెక్టార్లు, అమరావతి మండలంలో 2,750 హెక్టార్లలో పత్తి, మిర్చి పంటలు ముంపునకు గురయ్యాయి. దాచేపల్లి మం డలంలోని పొందుగుల, రామాపురం గ్రామాల్లో 151ఎకరాల పత్తిపంట నీట ము నిగి దెబ్బతింది. దుగ్గిరాల మండలంలో వరద ముంపుతో రెండేళ్లుగా పంటనష్ట పోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని నియోజకవర్గ టీడీపీ పూర్వ పు ఇన్‌చార్జి గంజి చిరంజీవి కోరారు.   


కాంట్రాక్టర్‌తో మాట్లాడమన్నాను : తహసీల్దారు

దీనిపై కొల్లూరు తహసీల్దారు జాన్‌పీటర్‌ను వివరణ కోరితే రైతులు కొందరు తన దగ్గరకు వచ్చి సమస్య వివరించారని, కాంట్రాక్టర్‌తో మాట్లాడి చేసుకోమని సూచించానని తెలిపారు. గతంనుంచి ఉన్న పాయను పూడ్చారన్న విషయం తెలియదన్నారు. ఆర్‌ఐని పంపి అదే నిజమైతే రైతుల పంటలు కాపాడేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.


ఆత్మహత్యే దిక్కు..

కౌలుకు రూ.1.5 లక్షల ఖర్చుపెట్టి కంద, అరటి వేశాను. గత ఏడాది వరదలకు పంట పోయింది. ఈ సారి కూడా దక్కకుంటే ఆత్మహత్యకు పాల్పడటం ఒక్కటే మార్గం.  ప్రకృతి కన్నెర్ర  చేసిందని మొదట బాధపడినా, ఒక్క రోజులోనే వరద తగ్గిపోవటంతో మాపై కరుణ చూపిందనుకున్నాము. అయితే మానవ స్వార్థం తో నష్టపోవాల్సి వస్తుంది. పంటను కాపాడాలని తహసీల్దారు దగ్గరకు వెళ్తే ఇసుక కాం ట్రాక్టర్‌ చాలా ఖర్చుపెట్టి రోడ్డు వేసుకున్నారు.. మీ పంటల కోసం ఆ రోడ్డును ఎట్లా గండి పెడతారని ప్రశ్నించారు. కాంట్రాక్టరు ఒప్పుకుంటే తవ్వుకోండని సమాధానమిచ్చారు. కాంట్రాక్టర్‌ను అడిగితే తవ్వటానికి వీలులేదన్నారు. 

  - రామయ్య  

Advertisement
Advertisement