శిథిలావస్థలో ఓవర్‌హెడ్‌ ట్యాంకు

ABN , First Publish Date - 2021-04-14T05:45:39+05:30 IST

కోసిగి కొండ సమీపంలోని ఓవర్‌హెడ్‌ ట్యాంకు శిథిలావస్థకు చేరింది. ట్యాంకు చుట్టూ ముళ్లకంప పెరిగి, ట్యాంకులో దిగడానికి మెట్లు లేవు. దీంతో కొన్ని సంవత్సరాలుగా ట్యాంకును శుభ్రపరచలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శిథిలావస్థలో ఓవర్‌హెడ్‌ ట్యాంకు

  1. అపరిశుభ్రంగా తాగునీరు..


కోసిగి, ఏప్రిల్‌ 13: కోసిగి కొండ సమీపంలోని ఓవర్‌హెడ్‌ ట్యాంకు శిథిలావస్థకు చేరింది. ట్యాంకు చుట్టూ ముళ్లకంప పెరిగి, ట్యాంకులో దిగడానికి మెట్లు లేవు. దీంతో కొన్ని సంవత్సరాలుగా ట్యాంకును శుభ్రపరచలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్యాంకులోకి తుంగభద్ర నది నీరు సరఫరా అవుతోంది. అయితే ట్యాంకు మెట్లు శిథిలావస్థకు చేరడంతో శుభ్రపరచే అవకాశం లేకుండా పోయిందని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ మల్లికార్జున రెడ్డి, పంచాయతీ ఈవో సత్తెన్న తెలిపారు. ఇటీవల ఆదోని, గోరుకల్లు గ్రామాల్లో పలువురు అతిసార బారిన పడ్డారని అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. 


రెండు రోజుల్లో శుభ్రపరుస్తాం 

ఓవర్‌హెడ్‌ ట్యాంకుకు మెట్లు లేనందున శుభ్రపరచలేదు. రెండు రోజుల్లో మెట్లు వేయించి శుభ్రపరిచి, ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందిస్తాం.              - ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ మల్లికార్జున రెడ్డి


Updated Date - 2021-04-14T05:45:39+05:30 IST