Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎల్లుండి Hyderabadలోని ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్‌

హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పలు ప్రాంతాలకు ఈ నెల 8న నీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు వరకు మంచినీటి సరఫరా ఉండదని అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్‌ వాటర్‌ సప్లై ప్రాజెక్టు (కేడీడబ్ల్యూఎస్‌పీ) ఫేజ్‌-1కు సంతో‌ష్‌నగర్‌ వద్ద వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో జంక్షన్‌ పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో మీరాలం, కిషన్‌బాగ్‌, అల్‌ జుబైల్‌ కాలనీ, సంతో‌ష్‌నగర్‌ , వినయ్‌నగర్‌, సైదాబాద్‌, చంచల్‌గూడ, అస్మాన్‌గఢ్‌, యాకూత్‌పురా, మాదన్నపేట, మహబూబ్‌ మాన్షన్‌, రియాసత్‌నగర్‌, ఆలియాబాద్‌, బొగ్గులకుంట, అఫ్జల్‌గంజ్‌, నారాయణగూడ, అడిక్‌మెట్‌, శివం, నల్లకుంట, చిలకలగూడ, దిల్‌సుఖ్‌నగర్‌, బొంగుళూరు, మన్నెగూడ రిజర్వాయర్ల పరిధిలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం తలెత్తనుంది.


Advertisement
Advertisement