ప్రతి మొక్కకూ నీరు అందించాలి

ABN , First Publish Date - 2021-06-23T05:32:15+05:30 IST

హరితహారంలో నాటిన ప్రతీ మొక్క కు నీటిని అందించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా అధికారులకు సూచించారు. నగరంలోని బైపాస్‌ రోడ్డు పక్కన గల నూతన సమీకృత కలెక్టరేట్‌, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో మం గళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని వారు పరిశీలించారు.

ప్రతి మొక్కకూ నీరు అందించాలి
మొక్కలు నాటే ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

నిజామాబాద్‌అర్బన్‌, జూన్‌ 22: హరితహారంలో నాటిన ప్రతీ మొక్క కు నీటిని అందించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా అధికారులకు సూచించారు. నగరంలోని బైపాస్‌ రోడ్డు పక్కన గల నూతన సమీకృత కలెక్టరేట్‌, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో మం గళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని మొక్కలకు నీటిని అందించడానికి రెండు బోర్లు, డ్రిప్‌ సిస్టం ప్లాన్‌ చేయడం జరిగిందన్నారు. బైపాస్‌ రోడ్డు వెంబడి మొక్కలు, ఎలక్ర్టికల్‌ లైట్స్‌ ఏర్పాటుతో రూపురేఖలు మారుతాయని, ఆకర్షనీయంగా కనిపిస్తాయన్నారు. అనంతరం మంత్రి, కలెక్టర్‌, అ డిషనల్‌ కలెక్టర్‌ చాంబర్లను వారు పరిశీలించారు. పక్కనే ఉన్న న్యాక్‌ భ వన నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రూరల్‌ గ్రామాల్లో కలెక్టర్‌ పర్యటన
నిజామాబాద్‌ రూరల్‌: కలెక్టర్‌ నారాయణరెడ్డి మంగళవారం రూరల్‌ మండలంలోని గుండారం, మల్కాపూర్‌(ఎ) గ్రామాల్లో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్డీవో రవి కుమార్‌లతో కలిసి పర్యటించారు. ఈ సం దర్భంగా ఆయన గ్రామ శివార్లలోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. రోడ్డుకు దగ్గరగా ఉన్న ప్రభుత్వ స్థలాలను చూశారు. రూరల్‌ తహసీల్దా ర్‌ ప్రశాంత్‌ కుమార్‌తోపాటు మండల సర్వేయర్‌ స్వప్నను అడిగి రెవెన్యూ సరిహద్దులు తెలుసుకున్నారు. ప్రభుత్వ స్థలాల సరిహద్దులను గుర్తించారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటుచేసే స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌కు సరిపడా అనువైన స్థలం కోసం రెవెన్యూ సిబ్బందితో చర్చించారు. సంబంధిత స్థలానికి రోడ్డు కనెక్టివిటీ, స్థల విస్తీర్ణత, రోడ్డుకు సమీపంలో ఉండడంతోపాటు ఇతర అంశాలను చర్చించారు. 

Updated Date - 2021-06-23T05:32:15+05:30 IST