నీటి నిల్వలను శుభ్రపర్చుకోవాలి

ABN , First Publish Date - 2021-05-17T05:36:08+05:30 IST

జడ్చర్ల పట్టణంలో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతు న్నాయని, ప్రజలు వారాని ఓ సారి ఇంటిలో, ఇంటి పరిసరాలలో ఉండే నీటి నిల్వలను శుభ్రపర్చుకోవాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దోరేపల్లి లక్ష్మీరవీందర్‌ అన్నారు.

నీటి నిల్వలను శుభ్రపర్చుకోవాలి
మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మిని సన్మానిస్తున్న జిల్లా మలేరియా ఆఽధికారి విజయ్‌కుమార్‌

- మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి

జడ్చర్ల, మే 16 : జడ్చర్ల పట్టణంలో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతు న్నాయని, ప్రజలు వారాని ఓ సారి ఇంటిలో, ఇంటి పరిసరాలలో ఉండే నీటి నిల్వలను శుభ్రపర్చుకోవాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దోరేపల్లి లక్ష్మీరవీందర్‌ అన్నారు. ఆదివారం అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మలేరియా వ్యాధిపై అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డెంగీవ్యాధి రాకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరు నిల్వ ఉన్న నీటిని వారానికి ఒకసారి శుభ్రపరుచుకొని, తిరిగి నీటిని నింపుకోవాలని సూచించారు. శుభ్రత ద్వారానే డెంగీ వ్యాధిని అరికట్టవచ్చని అన్నారు.  జడ్చర్ల మునిసిపల్‌లో ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని ప్రజలను ఆమే కోరారు. అంతకు ముందు నూతనంగా ఎన్నికైన చైర్‌పర్సన్‌ లక్ష్మిని, వైస్‌ చైర్‌పర్సన్‌ సారికను, కౌన్సిలర్‌ జ్యోతిలను మలేరియా జిల్లా అధికారి జె.డి. విజయ్‌కుమార్‌ సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కృష్ణ, మలేరియా జిల్లా అధికారి జె డి. విజయ్‌కుమార్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ పాలాది సారికరాంమోహన్‌, కౌన్సిలర్‌ జ్యోతి, డాక్టర్‌ శివకాంత్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-17T05:36:08+05:30 IST