నెలాఖరు నుంచి నీటి విడుదల

ABN , First Publish Date - 2021-06-25T05:40:59+05:30 IST

ఉమ్మడి జిల్లా పరిధిలోని నిజాంసాగర్‌ ఆయకట్టుకు సా గునీరు అందించేందుకు అధికారులు నిర్ణయించారు. ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టుకు నెలాఖరు నుంచి ఏడు తడులు నీ టిని అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

నెలాఖరు నుంచి నీటి విడుదల
నిజాంసాగర్‌లో ప్రస్తుత నీటినిల్వ

నిజాం సాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలకు నిర్ణయం
ఉమ్మడి జిల్లా పరిధిలో 2 లక్షల 8 వేల ఎకరాలకు సాగునీరు
సెప్టెంబరు చివరి వరకు 7 విడతల్లో సరఫరా
గుత్ప, అలీసాగర్‌ ఎత్తిపోతల కథకాల కింది ఆయకట్టుకు సైతం నీరు
శివం కమిటీ సమావేశంలో నిర్ణయించిన సాగునీటి శాఖ అధికారులు

నిజామాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి జిల్లా పరిధిలోని నిజాంసాగర్‌ ఆయకట్టుకు సా గునీరు అందించేందుకు అధికారులు నిర్ణయించారు. ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టుకు నెలాఖరు నుంచి ఏడు తడులు నీ టిని అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌ ఆఫ్‌ పద్ధతిలో సెప్టెంబరు చివర వరకు నీటి విడుదల కొన సాగించనున్నారు. వర్షాలను బట్టి చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నీటితో పాటు గుత్ప, అలీసాగర్‌, లక్ష్మికాలువల కింద ఉన్న ఆయకట్టుకు కూడా సాగునీటిని విడుదల చేయనున్నారు.
శివం కమిటీ సమావేశంలో నిర్ణయం
నిజాంసాగర్‌ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేసేందుకు ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన శివం కమిటీ స మావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ంలోని అన్ని ప్రాజెక్టుల సీఈలు, ఎస్‌ఈలు ఈ సమావేశానికి హాజరై ప్రస్తుతం ఉన్న నీటి నిల్వపై చర్చించారు. రాష్ట్రంలో కురిసే వర్షాలకు అనుగుణంగా పంటలు ఎండిపోకుండా నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  
నిజాంసాగర్‌లో 7.192 టీఎంసీల నీరు
నిజాంసాగర్‌ ప్రాజెక్టులో ప్రస్తుతం 7.192 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులకు గాను 1395.47 అడుగుల నీరు ఉంది. ప్రస్తుతం ఉన్న నీటిని బట్టి ప్రాజెక్టు పరిధిలో ఈ వానాకాలం 2 లక్షల 8 వేల ఎకరా లకు సాగునీరు అందించాలని శివం కమిటీలో నిర్ణయం తీ సుకున్నారు. నెలాఖరు నుంచి సాగునీటిని విడుదల చేసేం దుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల నుంచి సెప్టెంబరు చివరి వరకు ఏడు విడతలుగా ఆన్‌ఆఫ్‌ పద్ధతిలో నిర్ణయించి న ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు నిర్ణయం తీసుకు న్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు కింద కామారెడ్డి జిల్లాలోని 88 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. నిజాంసాగర్‌, బాన్సు వాడ, నస్రూల్లాబాద్‌, బీర్కూర్‌ మండలాల పరిధిలోని ఆయ కట్టుకు నీటిని అందిస్తారు. నిజామాబాద్‌ జిల్లాలోని అలీసా గర్‌ ఎత్తిపోతల వరకు లక్షా ఇరవై వేల ఎకరాల వరకు సాగు నీరు అందించనున్నారు. వర్ని, మోస్రా, రుద్రూరు, కోటగిరితో పాటు ఇతర మండలాలలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టు కాల్వల ద్వారా చివరి ఆయకట్టు వరకు అందించనున్నారు. ఇప్పటికే రైతులు నాట్లు వేస్తున్నందున వర్షాలు కుర వకపోతే నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకున్నారు. మొదట ఒక తడి నీటిని అందించనున్నారు. నిజాంసాగర్‌లో సగం వరకు నీళ్లు ఉండడం వల్ల ప్రస్తుతం నీటి విడుదలకు సిద్ధమవుతున్నారు. వర్షాలు మొదలై మరింత వరద వస్తే అ వసరం మేరకు ఆయకట్టుకు తడులను పెంచనున్నారు.
జిల్లాలో ఎస్సారెస్పీ నుంచి ఎత్తిపోతల ద్వారా..
జిల్లాలో నిజాంసాగర్‌ నీటితో పాటు మిగతా ఆయకట్టుకు ఎస్సారెస్పీ నుంచి ఎత్తిపోతల ద్వారా అందించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. గుత్ప, అలీసాగర్‌ ద్వారా నీటిని అందించనున్నారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాల పరిధిలోని ఆయకట్టుకు తాగునీరు అందించనున్నారు. గుత్ప అలీసాగర్‌ పరిధిలో సుమారు 85వేల ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. దీం తో పాటు లక్ష్మి కాల్వ ఎత్తిపోతల పథకాలకు కూడా నీటిని అందించేందుకు నిర్ణయించారు. ఎస్సారెస్పీకి వచ్చే వరద అ నుగుణంగా నీటిని విడుదల చేయనున్నారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం 1,091(90 టీఎంసీలు) అడుగులకుగాను 1,060.80 (24.954 టీఎంసీలు) అడుగుల నీరు ఉంది. మహారాష్ట్రలో కురిసే వర్షాలతో వరద వచ్చే అవకాశం ఉండడంతో మరిన్ని టీఎంసీలు రాగానే ఎత్తిపోతల పథకాలకు నీళ్లు అందించనున్నారు. జిల్లాలో వానాకాలంలో 3.86 లక్షల ఎకరాలకు పైగా వరిసాగు అయ్యే అవకాశం ఉండడంతో ఈ రెండు ప్రాజెక్టు ల పరిధిలో సాగు నీరు అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వారంలోపు భారీ వర్షాలు కురిస్తే నిజాంసాగర్‌ నుంచి ఈ నెలాఖరు నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు శివం కమిటీలో నిర్ణయం తీసుకున్నారని ఉ మ్మడి జిల్లాల సీఈలు మధుసూధన్‌రావు, శ్రీనివాస్‌ తెలిపా రు. రైతుల విజ్ఞప్తి మేరకు వర్షాలను బట్టి నీటిని విడుదల చేస్తామన్నారు. వానాకాలంలో మొత్తం ఆయకట్టుకు సాగునీ రు అందించే విధంగా చూస్తున్నామని తెలిపారు.

Updated Date - 2021-06-25T05:40:59+05:30 IST