16న మంచినీటి సరఫరాలో అంతరాయం

ABN , First Publish Date - 2022-08-13T06:40:40+05:30 IST

మహానగరానికి సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ సప్లై ప్రాజెక్ట్‌ (కేడీడబ్ల్యూ ఎస్పీ) ఫేజ్‌-1కి మీరాలం ఆలియాబాద్‌ ఆఫ్‌టేక్‌ వద్ద 1200 ఎంఎం డయా ఎంఎస్‌ గ్రావిటీ మెయిన్‌కు జంక్షన్‌ పనుల నేపథ్యంలో 16వ తేదీన పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు.

16న మంచినీటి సరఫరాలో అంతరాయం

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మహానగరానికి సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ సప్లై ప్రాజెక్ట్‌ (కేడీడబ్ల్యూ ఎస్పీ) ఫేజ్‌-1కి మీరాలం ఆలియాబాద్‌ ఆఫ్‌టేక్‌ వద్ద 1200 ఎంఎం డయా ఎంఎస్‌ గ్రావిటీ మెయిన్‌కు జంక్షన్‌ పనుల నేపథ్యంలో 16వ తేదీన పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ రోజు ఉదయం 6 నుంచి 17వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మరమ్మతులు కొనసాగుతుండడంతో ప్రాజెక్ట్‌ ఫేజ్‌-2, 3 కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయం ఏర్పడుతుంది. 

మీరాలం, కిషన్‌బాగ్‌, అల్‌ జులైల్‌ కాలనీ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు, సంతో్‌షనగర్‌, వినయ్‌నగర్‌, సైదాబాద్‌, చంచల్‌గూడ, ఆస్మాన్‌గఢ్‌, యాకుత్‌పురా, మాదన్నపేట, మహబూబ్‌మాన్షన్‌ రిజర్వాయర్ల పరిధిలో, రియాసత్‌నగర్‌, ఆలియాబాద్‌, బాలాపూర్‌ రిజర్వాయర్ల పరిధిలో, బొగ్గులకుంట, ఆఫ్జల్‌గంజ్‌ రిజర్వాయర్ల పరిధిలో, నారాయణగూడ, అడిక్‌మెట్‌, శివం, నల్లకుంట, చిలకలగూడ, దిల్‌సుఖ్‌నగర్‌, బొంగుళూరు, మన్నెగూడ రిజర్వాయర్‌ పరిధిలో, బాలాపూర్‌, మైసారం, బార్కాస్‌, శాస్ర్తిపురం, బండ్లగూడ, మెహిదీపట్నం, కార్వాన్‌, లంగర్‌హౌస్‌, కాకతీయనగర్‌, హుమాయున్‌నగర్‌, తాళ్లగడ్డ, ఆసి్‌ఫనగర్‌,. ఎంఈఎస్‌, షేక్‌పేట, ఓయూకాలనీ, టోలీచౌకి, మల్లేపల్లి, విజయనగర్‌కాలనీ, భోజగుట్ట, చింతల్‌బస్తీ, జియాగూడ, రెడ్‌హిల్స్‌, సెక్రటేరియట్‌, ఓల్డ్‌ ఎంఎల్‌ఏ క్వార్టర్స్‌, అల్లబండ, గగన్‌మహల్‌, హిమాయత్‌నగర్‌, మేకలమండి, భోలక్‌పూర్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, ప్రశాసన్‌నగర్‌, తట్టిఖానా, తార్నాక, లాలాపేట, బౌద్ధనగర్‌, మారేడ్‌పల్లి, కంట్రోల్‌ రూమ్‌, రైల్వే స్‌, ఎంఈఎస్‌, కంటోన్మెంట్‌, ప్రకా్‌షనగర్‌, పాటిగడ్డ, హస్మత్‌పేట్‌, ఫిరోజ్‌గూడ, గౌతమ్‌నగర్‌, సాహెబ్‌నగర్‌, వైశాలినగర్‌, బీఎన్‌రెడ్డి నగర్‌, వనస్థలిపురం, ఆటోనగర్‌, మారుతీనగర్‌, మహేంద్రహిల్స్‌, సైనిక్‌పురి, మౌలాలి, వెలుగుగుట్ట, రామంతాపూర్‌, ఉప్పల్‌ నాచారం, హబ్సిగూడ, చిలుకానగర్‌, బీరప్పగడ్డ, స్నేహపురి, కైలా్‌సగిరి, దేవేంద్రనగర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌, అయ్యప్పసొసైటీ, కావూరి హిల్స్‌, మధుబన్‌, దుర్గానగర్‌, బుద్వేల్‌, సులేమాన్‌నగర్‌, గోల్డెన్‌ హైట్స్‌, నైన్‌ నంబర్‌, హైదర్‌గూడ, రాజేంద్రనగర్‌, ఉప్పర్‌పల్లి, ఎంఎంపహాడీ, చింతల్‌ ప్రాంతాల్లో నీటిసరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-08-13T06:40:40+05:30 IST