Advertisement
Advertisement
Abn logo
Advertisement

విశాఖకు వాటర్ ప్లస్ సర్టిఫికెట్

విశాఖ: విశాఖ నగర కీర్తిలో మరో కిరీటం చేరింది. కేంద్రప్రభుత్వం  విడుదల చేసిన వాటర్ సర్టిఫికెట్ సాధించి మరోసారి ఖ్యాతిని గడించింది. ఇప్పటికే  స్మార్ట్ సీటిగా విశాఖ పేరుగాంచింది. దేశంలో కేవలం  తోమ్మిది నగరాలకే మాత్రమే వాటర్ సర్టిఫికెట్ అందుకున్న ఘనత దక్కింది. అందులో  విశాఖకు  గౌరవ ప్రధమైన స్థానం దక్కింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టే  స్వచ్చభారత్  కార్యక్రమాలు, స్వచ్చ సర్వేక్షన్, స్టార్ రేటింగ్ ఆఫ్ ఫ్రీ సీటిస్, ఓడీఎఫ్, ఓడిఎఫ్ ప్లస్, ఓడీఎఫ్  డబుల్ ప్లస్‌లలో అనేక  ఆవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా సామాజిక, పబ్లిక్ టాయిలెట్స్, పార్క్, పబ్లిక్ ప్రాంతాలలో వ్యక్తిగత మరుగుదొడ్లను, డ్రైన్, సెప్టిక్ ట్యాంక్  డిస్పోజల్ వ్యవస్థ, మురుగునీరు శుద్ది  కేంద్రాలను పరిశీలించి, వాటి నిర్వాహణలో మెరుగైన విధానాలను  ఆవలంభించినందుకు ఈ ఆవార్డును ఇచ్చారు. 

Advertisement
Advertisement