డీజిల్‌కు బదులు నీరు..

ABN , First Publish Date - 2022-08-13T05:40:53+05:30 IST

డీజిల్‌కు బదులు నీరు సరఫరా కావడంతో అవి వినియోగించిన మొరాయిస్తుండడంతో ప్రైవేట్‌ కంపెనీ తల పట్టుకుంటోంది.

డీజిల్‌కు బదులు నీరు..
డీజిల్‌లో వచ్చిన నీరు

- జీడీకే 11ఇంక్లైన్‌లో మొరాయిస్తున్న కంటిన్యూయస్‌మైనర్లు

- బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

గోదావరిఖని, ఆగస్టు 12: డీజిల్‌కు బదులు నీరు సరఫరా కావడంతో అవి వినియోగించిన మొరాయిస్తుండడంతో ప్రైవేట్‌ కంపెనీ తల పట్టుకుంటోంది. ఆర్‌జీ-1 పరిధిలోని జీడీకే 11ఇంక్లైన్‌లో వినియోగిస్తున్న కంటిన్యూయస్‌మైనర్లకు రామగుండం ఓసీపీ4 ప్రాజెక్టు నుంచి రోజూ డీజిల్‌ రవాణా అవుతుంది. కంటి న్యూయస్‌ మైనర్లను జెమ్‌కో సంస్థ నిర్వహిస్తుంది. గురువారం గనికి చేరిన డీజిల్‌లో నీరు రావడంతో సంస్థ అవాక్కయ్యింది. గురువారం మధ్యాహ్నం నుం చి కంటిన్యూయస్‌మైనర్లతో పాటు ఇతర యంత్రాలు మొరాయిస్తుండడంతో అనుమానం వచ్చిన అధికారులు వాటిని పరిశీలించగా డీజిల్‌లో మొత్తం నీరు రావడంతో షాక్‌ అయ్యారు. ట్యాంకర్‌ ద్వారా వచ్చిన డీజిల్‌ను పరిశీలించక ముందే వినియోగించడంతో కోట్ల రూపాయల యంత్రాలు దెబ్బతిన్నాయి. దీం తో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. అధికారులు కంటిన్యూయస్‌ మైనర్‌కు వినియోగించిన డీజిల్‌ షాంపిల్‌ సేకరించగా అందులో నీరు ఉన్నట్టు గుర్తిం చారు. డీజిల్‌లో వచ్చిన నీటి షాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు. 

Updated Date - 2022-08-13T05:40:53+05:30 IST