ఏలేరులో పెరుగుతున్న నీటి నిల్వలు

ABN , First Publish Date - 2021-06-14T04:30:35+05:30 IST

ఏలేశ్వరం, జూన్‌ 13: పరీవాహక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో మెట్ట ప్రాంత రైతు బాంధవిగా పేరుగాంచిన ఏలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు క్రమేపీ పెరుగుతున్నాయి. ప్రాజెక్టులో 86.56 మీటర్ల స్థాయిలో 24.11 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. ఆదివారం ఏజెన్సీ ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 130 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో ప్రస్తుతం 75.82 మీటర్ల స్థాయిలో

ఏలేరులో పెరుగుతున్న నీటి నిల్వలు
ఏలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు

75.82 మీటర్ల స్థాయిలో 11.81 టీఎంసీలు

ఏలేశ్వరం, జూన్‌ 13: పరీవాహక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో మెట్ట ప్రాంత రైతు బాంధవిగా పేరుగాంచిన ఏలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు క్రమేపీ పెరుగుతున్నాయి. ప్రాజెక్టులో 86.56 మీటర్ల స్థాయిలో 24.11 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. ఆదివారం ఏజెన్సీ ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 130 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో ప్రస్తుతం 75.82 మీటర్ల స్థాయిలో 11.81 టీఎంసీలకు నీటి నిల్వలు చేరుకున్నాయి. రిజర్వాయర్‌ నుంచి విశాఖ నగరానికి ఏలేరు ఎడమ కాలువ ద్వారా 225 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఏలేరు ఆయకట్టు భూములకు, తిమ్మరాజు చెరువు, పంపా జలాశయానికి తాత్కాలికంగా నీటి సరఫరా నిలిపివేశారు. జిల్లాలోని 67,614 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించడంతోపాటు విశాఖ నగర పారిశ్రామిక, తాగునీటి అవసరాలను తీరుస్తూ ఏలేరు జలాశయం ఆదుకుంటోంది. ప్రాజెక్టులో 72.84 మీటర్ల స్థాయిలో 6 టీఎంసీల వరకు నీటిని డెడ్‌ స్టోరేజ్‌గా ఉంచి ఆపై మిగిలిన నీటిని మాత్రమే ఇతర అవసరాలకు వినియోగించాలన్న నిబంధన ఉంది. ప్రతిఏటా ప్రాజెక్టు నుంచి విశాఖ నగరానికి 7 టీఎంసీల నీటిని తరలిచడం ద్వారా మిగిలిన నీటిని ఇతర సాగు, తాగునీటి అవసరాలకు సరఫరా చేయడం జరుగుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న 11.81 టీఎంసీల నీటి నిల్వల్లో డెడ్‌ స్టోరేజ్‌ 6 టీఎంసీలు పోను మిగిలిన 5.81టీఎంసీల నీటిని మాత్రమే ఇతర అన్ని అవసరాలకు వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.1650 కోట్లతో నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు ప్రాజెక్టులోకి గోదావరి జలాలు మళ్లించడం వల్ల సాగు, తాగు, ఇతర అవసరాలకు పుష్కలంగా నీటిని అందించే అవకాశం ఏర్పడింది. రెండేళ్లుగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి నీటి సరఫరా నిలిపివేయడంతో పరీవాహక ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాల కారణంగా వచ్చే వరద నీటి ప్రవాహంపైనే ఏలేరులో నీటి నిల్వలు పెంపుదల ఆధారపడి ఉంది. ఈ ఏడాది వరుణ దేవుడు కరుణిస్తేనే ఆయకట్టు భూములకు పుష్కలంగా సాగునీటిని సరఫరా చేసే పరిస్థితులు ఉన్నాయి.

Updated Date - 2021-06-14T04:30:35+05:30 IST