పెట్రోల్‌లో నీళ్లు.. వాహనదారుల ఆందోళన

ABN , First Publish Date - 2021-10-20T04:45:45+05:30 IST

రాయికల్‌ టోల్‌ ప్లాజా సమీపంలోని

పెట్రోల్‌లో నీళ్లు.. వాహనదారుల ఆందోళన
పెట్రోల్‌ బంకులో నుంచి వచ్చిన నీళ్లు

షాద్‌నగర్‌రూరల్‌: రాయికల్‌ టోల్‌ ప్లాజా సమీపంలోని ఓ పెట్రోల్‌ బంకులో కారులో పెట్రోల్‌ పోయించుకున్న వాహనదారులు అందులో నీళ్లు కలిశాయని తెలుసుకుని ఆందోళకు దిగారు. జడ్చర్లకు చెందిన శ్రీనివాస్‌, బెంగుళూరుకు చెందిన చరణ్‌ హైదరాబాద్‌కు కారులో వెళ్తూ రాయికల్‌ టోల్‌ ప్లాజా సమీపంలోని బంకులో శ్రీనివాస్‌ రూ.3500, చరణ్‌ రూ.3290 చెల్లించి పెట్రోల్‌ పోయించుకున్నారు. సుమారు మూడు కిలోమీటర్లు దూరం వెళ్లగానే రెండు కార్లు ఆగిపోయాయి. ఇంజన్‌ లోపం వల్ల ఆగిపోయాయని భావించిన వారు మెకానిక్‌ను పిలిపించి చెక్‌ చేయించారు. పెట్రోల్‌లో నీళ్లు కలవడం వల్ల కారు స్టార్ట్‌ కావడం లేదని మెకానిక్‌ చెప్పారు. దాంతో వాహనదారులు తిరిగి బంక్‌ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. మూడు గంటల తర్వాత బంక్‌ యజమాని సురేందర్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. పెట్రోల్‌లో నీళ్లు రావడంలో తమ తప్పులేదని, పెట్రోల్‌లో కలిసే కెమికల్‌ పర్సెంటేజ్‌ ఎక్కువ కావడం వల్లే ఆలా జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. 




Updated Date - 2021-10-20T04:45:45+05:30 IST