ఘాట్లకు జలకళ

ABN , First Publish Date - 2020-11-27T06:01:25+05:30 IST

తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమైన ఏడో రోజున ఘాట్లు జలకళ సంతరించుకున్నాయి

ఘాట్లకు జలకళ
మంత్రాలయంలో భక్తులు

  1. సుంకేసుల నుంచి 7,780 క్యూసెక్కులు
  2. మంత్రాలయంలో భక్తులు


కర్నూలు, ఆంధ్రజ్యోతి:  తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమైన ఏడో రోజున ఘాట్లు జలకళ సంతరించుకున్నాయి. సీఎం జగన్‌ వచ్చిన రోజు మినహా ఘాట్లలో తగినంత నీరు లేదు. అయితే గురువారం ఘాట్లలో నీటి మట్టం కాస్త పెరిగింది. ఏపీలో నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటం.. నదిలో నీరు పారుతుండడంతో భక్తులు సెల్ఫీలు, స్నానాలతో ఆనందంగా గడిపారు. నీరు ఇలానే ఉంటే భక్తుల సంఖ్య పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. పుష్కరాలు ప్రారంభమైన తొలిరోజున 6,600 క్యూసెక్కులు విడుదలైనా ఆ మరుసటి రోజే నీరు తగ్గింది. దీంతో నదిలో నీరు లేక ఘాట్ల వద్ద బురదగా మారింది. రెండ్రోజులుగా సుంకేసుల నుంచి నీరు విడుదల చేస్తున్నారు. సుంకేసుల నుంచి 7,780 క్యూసెక్కుల నీరు రావడంతో గురువారం ఘాట్లు కళకళలాడాయి. సంగమేశ్వరంలో మాత్రం రద్దీ తగ్గింది.


మంత్రాలయంలో పెరిగిన రద్దీ

పుష్కరాల ఏడో రోజు మంత్రాలయంలో రద్దీ పెరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. ముఖ్యంగా రాష్ట్ర నలుమూలలతో పాటు కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. షవర్ల కింద స్నానాలు చేసి నదికి ప్రత్యేక పూజలు చేశారు. పసుపు, కుంకుమ, గాజులు, రవికె సమర్పించారు. 


Updated Date - 2020-11-27T06:01:25+05:30 IST