వేసవిలో జలకళ

ABN , First Publish Date - 2021-04-21T07:00:34+05:30 IST

రోజురోజుకు ఎండ తీవ్ర త పెరిగి భూగర్భ జలాలు అడుగంటుతున్న వేళ.. శా లిగౌరారం ఫీడర్‌ చానల్‌ పరిధిలో చెరువులు కుంట లు నిండుకుండలా అలుగుపోస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వేసవిలో జలకళ
శాలిగౌరారం మండలంలో అలుగుపోస్తున్న నూలగడ్డ కొత్తపల్లి కంది కుంట చెరువు

శాలిగౌరారం, ఏప్రిల్‌ 20: రోజురోజుకు ఎండ తీవ్ర త పెరిగి భూగర్భ జలాలు అడుగంటుతున్న వేళ.. శా లిగౌరారం ఫీడర్‌ చానల్‌ పరిధిలో చెరువులు కుంట లు నిండుకుండలా అలుగుపోస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ వద్దనున్న మూసీనది ఆనకట్ట నుంచి నల్లగొండ జిల్లా శాలిగౌరా రం ప్రాజెక్ట్‌కు ఫీడర్‌ చానల్‌ ఉంది. ప్రస్తుతం మూసీనది ప్రవహించడంతో పల్లివాడ ఆనకట్ట నుంచి శాలిగౌరారం ప్రాజెక్ట్‌ వరకు ఫీడర్‌ చానల్‌ ఉధృతంగా ఉరకలు వేస్తోంది. ఫీడర్‌ చానల్‌ పరిధిలోని పలుగ్రామాల చెరువులు , కుంటలు నిండి అలుగుపోస్తున్నా యి. శాలిగౌరారం ప్రాజెక్ట్‌లోకి నీరు ఉధృతంగా రావడంతో ప్రాజెక్ట్‌ నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది.


Updated Date - 2021-04-21T07:00:34+05:30 IST