నీరు లేకుంటే మనిషి జీవితమే లేదు

ABN , First Publish Date - 2020-12-01T04:01:08+05:30 IST

నీరు లేకుంటే మనిషి జీవితమే లేదు

నీరు లేకుంటే మనిషి జీవితమే లేదు
ఇబ్రహీంపట్నం చెరువు వద్ద హారతి ఇస్తున్న అఖండ ట్రస్టు సభ్యులు

ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి

పట్నం పెద్ద చెరువు వద్ద గంగమ్మకు హారతి

ఇబ్రహీంపట్నం : నీరు లేకుంటే మనిషి జీవితమే లేదని ఇబ్రహీంపట్నం అఖండ ట్రస్టీ సభ్యుడు ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కార్తీక పౌర్ణమిని పురష్కరించుకొని ట్రస్టు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం సమీపంలోని పెద్ద చెరువువద్ద గంగమ్మకు అఖండ హారతినిచ్చారు. ప్రతి యేటా గంగమ్మకు అఖండ హారతి.. శివయ్యకు అఖండ జ్యోతి పేర్లతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడ హారతినిచ్చి అనంతరం అఖండ జ్యోతితో ర్యాలీగా బయలుదేరి రాచకొండలోని కోదండ రామస్వామి ఆలయంలో జ్యోతిని వెలిగించారు. ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనవాళి సుఖ సంతోశాలతో విలసిల్లడానికే ఎంతో చరిత్ర కలిగిన పెద్ద చెరువుకు హారతినిస్తున్నామని అన్నారు. తెలంగాణలోనే ఎత్తయిన 104 అడుగుల పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని పెద్ద చెరువు కొనకట్టపై ఏర్పాటుకు పూనుకోవడం హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త లింగం శ్రీధర్‌, అఖండ క్షేత్ర మండలి సభ్యులు శ్రీరాంరెడ్డి, భిక్షపతి, శ్రీనివాస్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T04:01:08+05:30 IST