రబీకి..సీలేరు!

ABN , First Publish Date - 2020-11-22T05:21:27+05:30 IST

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి సామర్థ్యం 20 టీఎంసీలు మాత్రమే ఉండ డంతో రబీకి నీటి ఎద్దడి తప్పదు. సీలేరు జలాలపై ఆధారపడక తప్పదు..

రబీకి..సీలేరు!
విజ్జేశ్వరం హెడ్‌ స్లూయిజ్‌ నుంచి పశ్చిమ డెల్టా కాలువలకు విడుదలవుతున్న నీరు

గోదావరిలో తగ్గిన నీటి సామర్థ్యం

సీలేరు జలాలు వస్తేనే గట్టెక్కేది 

ఈ నెలలోనే ఐఏబీ సమావేశం  

రబీకి సిద్ధమవుతున్న రైతాంగం

రబీకి నీటి ఎద్దడా..? వంతుల వారీ విధానమా..? అదేం అవసరం లేదు.. ఈ ఏడాది అడపాదడపా వానలు పడ్డాయా.. ఎక్కడా బ్రేక్‌ లేదు.. గోదావరి కూడా నిండుగానే ఉంది.. అనుకుంటున్నారా..! ఎంత నిండుగా ఉన్నా.. ఎంతలా వానలు పడ్డా.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి సామర్థ్యం 20 టీఎంసీలు మాత్రమే ఉండ డంతో రబీకి నీటి ఎద్దడి తప్పదు. సీలేరు జలాలపై ఆధారపడక తప్పదు.. గతే పదేళ్లుగా లెక్కలు చూస్తే ప్రతీ ఏడాది సీలేరే ఆధారంగా నిలిచింది.. పంటను గట్టెక్కించింది.. 


నిడదవోలు, నవంబరు 21 : గోదావరి 120 రోజులుగా నిండుగా ప్రవహి స్తూనే ఉంది.. ప్రతీ రోజూ లక్షలాది క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.. అంతలా వానలు పడ్డాయి. నేటికీ కాస్తో కూస్తో నీటిని సముద్రంలోకి విడుదల చేస్తూనే ఉన్నారు. ఇంకేముంది ఈ ఏడాది రబీకి నీటి కటకట  ఉం డదని అంతా భావించారు. ఈ ఏడాది భారీ వర్షాలు, వరదలు పోటెత్తినా ఇప్పుడు రబీకి మాత్రం పూర్తి స్థాయిలో నీరందుతుందా లేదా అనే దానిపై సందేహం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరిలో నీటి నిల్వ సామర్థం తగ్గడంతో ప్రతీ ఏడాది నీటి ఎద్దడి తప్పడం లేదు. సీలే రు జలాలు వినియోగించకుండా సాగు జరగ డం లేదు. గోదావరిలో నీరు చూస్తు ంటే ఈ ఏడాది కూడా సీలేరు జలాలు ఆధారమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెలలోనే నిర్వహించనున్న ఇరిగేషన్‌ అడ్వయిజరీ బోర్డు (ఐఏబీ) సమావేశంలో  రబీ పం టలో గోదా వరి జలాలు, సీలేరు జలాలకు సంబంధించి వంతులవారి విధానంపైనా  అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తారు.


జనవరి నుంచి వంతుల వారీ.. 

ప్రతి ఏడాది రెండవ పంట సమయంలో ఊడ్పులు పూర్తయిన తరువాత జనవరి నుంచి వంతుల వారి విధానాన్ని జలవనరుల శాఖ అమలు చేస్తోంది. డెల్టాలోని సుమారు 4.60 లక్షల ఎకరాలకు వంతుల వారీ విధానంలో నీటిని అందిస్తున్నారు. పశ్చిమ డెల్టా పరిధిలో 2001 నుంచి మొదటి సారిగా రబీలో వంతుల వారి విధానానికి శ్రీకారం చుట్టారు. పూర్తి స్తాయిలో శివారు ప్రాంత రైతాంగానికి కూడా నీటిని అందించే ప్రక్రియను ఆరంభించారు. గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 90 టీఎంసీల నీరు స్టోరేజ్‌కు అవ కాశం ఏర్పడనుంది. దీంతో పోలవరం పూర్త యిన తరువాత రబీకి గోదావరి జలాలు సరిపోతాయి. అప్పటి వరకు రబీలో సీలేరు జలాలపై ఆధార పడక తప్పదనేది ఇటు రైతా ంగం అటు అధికారులు చెబుతున్న మాట.  


సమస్య ఎందుకంటే.. 

అఖండ గోదావరిలో గత రెండేళ్ల కిందట బొబ్బర్లంక బ్యారేజీ వద్ద ఐదు శాతం మాత్రమే డ్రెడ్జింగ్‌ చేశారు. పూర్తి స్తాయిలో డ్రెడ్జింగ్‌ చేస్తే నీటి లభ్యత సహజసిద్ధంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సుమారు 24 ఏళ్లగా గోదావరి నదిలో డ్రెడ్జింగ్‌ చేయకపోవడం ఒక ప్రధాన కారణం. భారీ బడ్జెట్‌ను డ్రెడ్జింగ్‌ ప్రక్రియకు కేటాయించకపోవడంతో గోదావరిలో ఇసుక మేటలు పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో గోదావరిలో సహజ నీటి లభ్యత బాగా తగ్గింది. అంతే కాకుండా గోదావరి పరివాహక ప్రాంతాల్లోని అడవుల్లో వృక్ష సంపద తగ్గిపో వడం, వర్షపు నీరు భూమిలోకి ఇంకకపోవడం తదితర కారణాలతో రబీకి సీలేరు జలాలే ఆధారం అవుతున్నాయి. 


3,450 టీఎంసీలు సముద్రం పాలు.. 

ఈ ఏడాది ధవళేశ్వరం బ్యారేజీ నుంచి అదనపు నీటిని సముద్రంలోకి విడిచి పెడుతూ వచ్చారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 20 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసే సామర్థ్యం ఉండడంతో ఈ ఏడాది జూన్‌ ఒకటవ తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారుగా 3,450 టీఎంసీల నీరు సముద్రంలోకి వృఽథాగా పోయింది. ఈ నెలాఖరు నాటికి ఇన్‌ఫ్లో కూడా ఆగిపోనుంది. 


గత పదేళ్లగా  రబీ పంటకు గోదావరి జలాల కన్నా సీలేరు జలాలే ఊపిరి పోస్తున్నాయి. మరో పక్క వేలాది టీఎంసీల  గోదావరి జలాలు సముద్రంలోకి వృథాగా పోతున్నాయి.

 గత పదేళ్లగా సీలేరు జలాలు వినియోగం ఇలా.. (టీఎంసీలలో)

 సంవత్సరం  సముద్రం సీలేరు గోదావరి రబీ 

పాలైన నీరు జలాలు జలాలు వినియోగం

2009–10 793.254 21.701 25.580 47.281

2010–11 3668.039 38.736 91.100 129.836

2011–12 1530.207 31.762 30.959 62.721

2012–13 2678.829 39.118 39.805 78.923

2013–14 4728.478 41.537 77.128 118.665

2014–15 1896.895 49.933 45.122 95.055

2015–16 1254.024 52.070 24.701 76.771

2016–17 2361.840 44.763 47.805 92.568

2017–18 915.531 63.756 20.891 84.647

2018–19 2449.128 55.791 31.482 87.273

2019–20 3.450 45.763 21.891 92.569

Updated Date - 2020-11-22T05:21:27+05:30 IST