అసంతృప్తితోనే టీవీ వీక్షణం

ABN , First Publish Date - 2020-02-28T21:28:52+05:30 IST

అదేపనిగా టీవీ చూడటంలో మునిగిపోవడానికి కారణం కనుక్కున్నారు మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు. వీరు సుమారు నలభై వేలమందితో చేసిన అధ్యయనం ఆసక్తి

అసంతృప్తితోనే టీవీ వీక్షణం

అదేపనిగా టీవీ చూడటంలో మునిగిపోవడానికి కారణం కనుక్కున్నారు మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు. వీరు సుమారు నలభై వేలమందితో చేసిన అధ్యయనం ఆసక్తి గొలిపే విషయాలు బయటపెట్టింది. వివిధ రకాల సమస్యలు, కోరికలుండి అవి తీరక అసంతృప్తితో ఉన్నవారు టీవీ ఎక్కువగా చూస్తుంటారని ఆ సర్వే వెల్లడించింది. ఆనందంగా ఉండేవారు టీవీ చూసే గంటలతో పోల్చినపుడు అసంతృప్తిపరులు 30 శాతం అధికంగా కార్యక్రమాల వీక్షణకు కేటాయిస్తున్నారు. తాత్కాలికంగా ఇది మనసుకు ఊరటనిచ్చినప్పటికి దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్యసమస్యలకు దారి తీస్తుందన్న సంగతి తెలిసిందే! ఇదే విషయాన్ని వీరు నిర్దారించారు.

Updated Date - 2020-02-28T21:28:52+05:30 IST