Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోర్న్‌ చూసేస్తున్నారు

50ఏళ్లకు పైబడినవారే అత్యధికం

ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా వెరవని వైనం

‘ఆంధ్రజ్యోతి’ సర్వేలో ఆసక్తికర అంశాలు


ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌: ప్రభుత్వం పోర్నోగ్రఫీ వెబ్‌సైట్లను నిషేధించినా ఉమ్మడి జిల్లాలో ఆ తరహా వీడియోలు చూస్తున్నవారు 18శాతం మంది ఉన్నారు. అందులో 25శాతం మంది 50ఏళ్ల వయసు పైబడినవా రు ఉండటం గమనార్హం. అంతేగాక పోర్న్‌ సైట్స్‌ పంపే లింకులతో అనర్థాలు ఉంటాయని తెలిసినా 49శాతం మంది వెరవకపోవడం గమనార్హం. ఇటీవల పోర్నో వీక్షణం పెరుగుతుండటం, దీనితో పలు అనర్థాలు చోటుచేసుకుంటుండటంతో ‘ఆంధ్రజ్యోతి’ శనివారం ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేతో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.


సర్వే సాగిందిలా..

ఉమ్మడి జిల్లాలో మిర్యాలగూడ, చౌటుప్పల్‌, సూర్యాపేట, కోదాడ, భువనగిరి, నల్లగొండ, మోత్కూరు, దేవరకొండ పట్టణాల్లో శనివారం సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 18-30ఏళ్ల మధ్య వయసువారిని 46 మందిని, 31-50 ఏళ్ల వయసు ఉన్నవారిని 34 మందిని, 51ఏళ్లు పైబడినవారిని 20 మందిని మొత్తం 100 మందిని ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు సర్వే చేశారు. ఈ 100మందికి మూడు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. ఆ ప్రశ్నలివీ..


1. మీరు పోర్న్‌ వీడియోస్‌ చూస్తారా?

2. ఆ తరహా లింక్స్‌ వస్తే ఓపెన్‌ చేస్తారా?

3. ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయని తెలుసా?

పోర్న్‌ వీడియోస్‌ చూస్తామని సర్వేలో 18శాతం మంది చెప్పగా, చూడటంలేదని 63శాతం మంది, సమాధానం ఇచ్చేం దుకు 19శాతం మంది నిరాకరించారు. కాగా, వీడి యోస్‌ చూస్తున్నవారిలో 18-30 ఏళ్ల వయసువారు 15.2శాతం మంది, 31-50 వయసువారు 17.6శాతం మంది, 51ఏళ్లకు పైబడినవారు 25శాతం మంది ఉన్నారు. మొబైల్‌కు పోర్న్‌ వీడియోస్‌కు సంబం ధించిన లింక్‌ వస్తే 18శాతం మంది ఓపెన్‌ చేస్తామని  చెప్పారు. అందులో 18-30 వయ సువారు 13శాతం మంది, 31-50 వయసు వారు 26.4శాతం మంది, 51 ఏళ్లకు పైబడినవారు 15శాతం మంది ఉన్నారు. సమాధానం ఇచ్చేందుకు 24శాతం మంది నిరాకరించారు. ఫోర్న్‌ వీడియోస్‌ లింకులతో ఇబ్బంది కర పరిణామాలు ఉంటాయనే విషయం తెలుసని 49మంది తెలిపారు. అందులో 18-30 వయసువారు 45.6శాతం మంది, 31-50 వయసువారు 41.1శాతం మంది, 51ఏళ్లకు పైబడినవారు 70శాతం మంది ఉన్నారు. సమాధానం చెప్పేందుకు 26శాతం మంది నిరాకరించారు.


1. మీరు పోర్న్‌ వీడియోస్‌ చూస్తారా?

వయసు చూస్తాను(ు) చూడను(ు) చెప్పను(ు) మొత్తం

18-30 7 (15.2) 27 (58.6) 12 (26.0) 46

31-50 6 (17.6) 22 (64.7) 6 (17.6) 34

51+     5 (25.0) 14 (70.0) 1 (5.0) 20

మొత్తం     18     63     19 100


2. ఆ తరహా లింక్స్‌ వస్తే ఓపెన్‌ చేస్తారా?

వయసు చేస్తాను(ు) చేయను(ు) చెప్పను(ు) మొత్తం

18-30 6 (13.0) 25 (54.3) 15 (32.6) 46

31-50 9 (26.4) 18 (52.9) 7 (20.5) 34

51+         3 (15.0) 15 (75.0) 2 (10.0) 20

మొత్తం             18 58         24         100


3. ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయని తెలుసా?

వయసు తెలుసు(ు) తెలియదు(ు) చెప్పను(ు) మొత్తం

18-30 21 (45.6) 10 (21.7) 15 (32.6) 46

31-50 14 (41.1) 10 (29.4) 10 (29.4) 34

51+         14 (70.0)    5  (25.0)     1 (5.0) 20

మొత్తం            49 25     26 100

Advertisement
Advertisement