Abn logo
Feb 19 2020 @ 23:19PM

మళ్లీ మళ్లీ చూశా... సినిమా అద్భుతమే!

‘‘మూణ్ణెళ్ల క్రితం ఈ సినిమా చూశా. నచ్చింది. కానీ, అక్కడక్కడా చిన్న అసంతృప్తి. సుజోయ్‌, సుశీల్‌కు అదే చెప్పా. చిన్న చిన్న కరెక్షన్స్‌ చేసి మళ్లీ వారం తర్వాత చూపించారు. ఇంకా బావుంది. నెల ముందు మళ్లీ చూపించారు. మూణ్ణాలుగుసార్లు చూసిన వ్యక్తిగా చెబుతున్నా... దర్శకులిద్దరూ అద్భుతమైన సినిమా తీశారు. 12 ఏళ్ల క్రితం తలో చెయ్యి వేస్తేనే నేను రాగలిగా. అప్పటి నా పరిస్థితిని వీళ్లలో చూసుకున్నా’’ అని క్రిష్‌ అన్నారు. సాయి రోనక్‌, ప్రీతి అన్సారి జంటగా, రాహుల్‌ రామకృష్ణ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘ప్రెషర్‌ కుక్కర్‌’. సుజోయ్‌, సుశీల్‌ స్వీయ దర్శకత్వంలో అప్పిరెడ్డితో కలిసి నిర్మించారు. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించారు. ‘‘నువ్వు అమెరికాకు వెళ్లకపోతే ఎందుకు పనికి రావని పిల్లలను ప్రెజర్‌ పెడుతున్న తల్లితండ్రులకు ఈ సినిమా ఒక కనువిప్పు’’ అని తనికెళ్ల భరణి అన్నారు. ‘‘చదువు-ర్యాంకుల పేరుతో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి, చదువు పూర్తయిన తర్వాత అమెరికా వెళ్లాక, ఇండియాలో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ల తల్లిదండ్రులు పిల్లల్ని వెనక్కి రమ్మన అడగలేక పడే మానసిక సంఘర్షణ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించాం’’ అని సుజోయ్‌, సుశీల్‌ అన్నారు. 

Advertisement
Advertisement
Advertisement