ఆ విషయంలో..సచిన్‌ కన్నా కోహ్లీ మిన్న

ABN , First Publish Date - 2020-07-04T08:45:40+05:30 IST

భారత్‌ తరఫున పరిమిత ఓవర్లలో విరాట్‌ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడని టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీమ్‌ జాఫర్‌ ప్రశంసించాడు. తెల్లబంతి అత్యుత్తమ

ఆ విషయంలో..సచిన్‌ కన్నా కోహ్లీ మిన్న

న్యూఢిల్లీ: భారత్‌ తరఫున పరిమిత ఓవర్లలో విరాట్‌ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడని టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీమ్‌ జాఫర్‌ ప్రశంసించాడు. తెల్లబంతి అత్యుత్తమ ఆటగాళ్లలో సచిన్‌ టెండూల్కర్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలో ఎవరిని ఎంపిక చేసుకుంటావన్న ప్రశ్నకు.. ఏమాత్రం ఆలోచించకుండా ప్రస్తుత టీమిండియా సారథి అని జాఫర్‌ సమాధానమిచ్చాడు. ఇందుకు అతను నమోదుచేసిన గణాంకాలు, సగటే నిదర్శనమని చెప్పాడు. ఇక.. టీమిండియాలో తన ఫేవరెట్‌ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అని జాఫర్‌ తెలిపాడు. ‘2000 తర్వాత అతను జట్టు బాధ్యతలను భుజానికెత్తుకున్నాడు. దూకుడుగా ఎలా ఉండాలో నేర్పడంతో పాటు జట్టులోని సభ్యులకు ఎన్నోసార్లు అండగా నిలబడ్డాడు. సెహ్వాగ్‌, జహీర్‌, యువరాజ్‌, హర్భజన్‌లాంటి వాళ్లు స్టార్లుగా ఎదగడంలో కీలకపాత్ర పోషించాడు’ అని ఉత్తరాఖండ్‌ రంజీ జట్టు కోచ్‌ కూడా అయిన జాఫర్‌ వ్యాఖ్యానించాడు. 

Updated Date - 2020-07-04T08:45:40+05:30 IST