అజార్ అదే తప్పు మళ్లీ చేశాడు: వసీం అక్రం

ABN , First Publish Date - 2020-08-10T04:26:39+05:30 IST

పాకీస్తాన్ టెస్టు కెప్టెన్ అజార్ అలీపై మాజీ కెప్టెన్ వసీం అక్రం ఆగ్రహం వ్యక్తం చేశాడు. టెస్టుల్లో అజార్ ఒకే తప్పును మళ్లీ మళ్లీ చేస్తున్నాడని...

అజార్ అదే తప్పు మళ్లీ చేశాడు: వసీం అక్రం

ఇస్లామాబాద్: పాకీస్తాన్ టెస్టు కెప్టెన్ అజార్ అలీపై మాజీ కెప్టెన్ వసీం అక్రం ఆగ్రహం వ్యక్తం చేశాడు. టెస్టుల్లో అజార్ ఒకే తప్పును మళ్లీ మళ్లీ చేస్తున్నాడని అసహనం వ్యక్తం చేశాడు. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో అజార్ పూర్తిగా విఫలమవుతున్నాడని, ఇంగ్లాండ్ టెస్టు ఓటమిలోనూ అదే తరహా వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపించిందని విమర్శించారు. ‘వోక్స్ బ్యాటింగ్‌‌కు వచ్చిన తర్వాత బౌలర్లు ఒక్క బౌన్సర్ కూడా వేయలేదు. దాంతో అతడికి క్రీజులో కుదురుకునేందుకు కావలసినంత సమయం దొరికింది. దాంతో బట్లర్‌తో కలిసి చక్కటి ఇన్నింగ్స్‌ నిర్మించాడు. దీంతో మ్యాచ్‌ను పాక్ చేజార్చుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో అజార్ కొంత దృష్టి సారించి ఉంటే విజయం తప్పక లభించేద’ని అభిప్రాయపడ్డాడు.

Updated Date - 2020-08-10T04:26:39+05:30 IST