Abn logo
Jan 25 2021 @ 03:52AM

ఆ సవాలుకు సిద్ధం

అవకాశమొస్తే టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమని ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ప్రకటించాడు. ‘భారత్‌ తరపున టెస్ట్‌ల్లో ఇన్నింగ్స్‌ ప్రారంభించే చాన్స్‌ లభిస్తే వరంగా భావిస్తా. తానాడిన రోజుల్లో ఓపెనర్‌గా వచ్చిన అవకాశాన్ని ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి సవాలుగా తీసుకున్నాడు. నేను కూడా అదేవిధంగా సవాలుగా తీసుకొని ఆడతా’ అని సుందర్‌ అన్నాడు. 

Advertisement
Advertisement
Advertisement