టెయిలెండర్లపై వాషింగ్టన్ సుందర్ తండ్రి షాకింగ్ కామెంట్స్

ABN , First Publish Date - 2021-03-07T18:35:28+05:30 IST

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 96 పరుగులతో సెంచరీ మిస్ చేసుకున్న విషయం తెలిసిందే. జట్టు ఆలౌట్ కావడంతో నాటౌట్‌గా ఉన్నప్పటికీ అతడు సెంచరీ పూర్తి చేయలేకపోయాడు. సుందర్ తండ్రి ఎం సుందర్ స్పందించారు. టెస్టుల్లో తన కొడుకు తొలి సెంచరీ..

టెయిలెండర్లపై వాషింగ్టన్ సుందర్ తండ్రి షాకింగ్ కామెంట్స్

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 96 పరుగులతో సెంచరీ మిస్ చేసుకున్న విషయం తెలిసిందే. జట్టు ఆలౌట్ కావడంతో నాటౌట్‌గా ఉన్నప్పటికీ అతడు సెంచరీ పూర్తి చేయలేకపోయాడు. సుందర్ తండ్రి ఎం సుందర్ స్పందించారు. టెస్టుల్లో తన కొడుకు తొలి సెంచరీ అందుకోలేకపోవడం బాధకలిగించిందని అన్నారు. ముఖ్యంగా టెయిలెండర్ల ఆటతీరు తనకు నిరాశ కలిగించిందని, కనీసం కొన్ని నిముషాలు కూడా క్రీజులో నిలబడలేకపోవడం బాధించిందన్నారు. ‘ఒకవేళ టీమిండియా గెలుపునకు మరో 10 పరుగుల దూరంలో ఉండి.. ఇలానే జరిగితే అది ఎంత పెద్ద తప్పో వేరే చెప్పాల్సిన పనిలేదు. దేశంలో కోట్లమంది మ్యాచ్ చూస్తుంటారు. ఇలా ఆడిన టెయిలెండర్ల నుంచి వారు నేర్చుకోకూడదు. 


అయితే నాకు తెలిసి అది బ్యాటింగ్ మెళకువలకు, టెక్నిక్‌కు సంబంధించిన విషయం కాదు. ధైర్యానికి సంబంధించిన విషయమ’ని ఎం సుందర్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన కొడుకు బ్యాటింగ్ చేయడాన్ని అంతా ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారని, అందులో కొత్తేమీ లేదని, అతడు ఎక్కడైనా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ఆటగాడని, కొత్త బంతిని సైతం దీటుగా ఎదుర్కోగలడని చెప్పారు. కానీ అవసరాల దృష్ట్యా అతడిని ఎలా వినియోగించుకోవాలనేది జట్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

Updated Date - 2021-03-07T18:35:28+05:30 IST