మొండి మరకలతో జాగ్రత్త!

ABN , First Publish Date - 2020-08-13T05:30:00+05:30 IST

వంటింట్లో మొదట శుభ్రంగా ఉందో లేదో చూసుకోవాల్సింది స్టవ్‌ని. వంట చేసిన తర్వాత మరకలు స్టవ్‌ మీద ఉండకుండా సర్ఫ్‌ నీళ్లతో శుభ్రంగా కడగాలి. అలాగే కూరలు తాళింపు వేసేటప్పుడు నూనె జిడ్డు స్టవ్‌ను ఆనుకుని ఉన్న గోడపై కూడా పడుతుంది...

మొండి మరకలతో జాగ్రత్త!

  1. వంటింట్లో మొదట శుభ్రంగా ఉందో లేదో చూసుకోవాల్సింది స్టవ్‌ని. వంట చేసిన తర్వాత మరకలు స్టవ్‌ మీద ఉండకుండా సర్ఫ్‌ నీళ్లతో శుభ్రంగా కడగాలి. అలాగే కూరలు తాళింపు వేసేటప్పుడు నూనె జిడ్డు స్టవ్‌ను ఆనుకుని ఉన్న గోడపై కూడా పడుతుంది. దాన్ని సర్ఫ్‌ నీళ్లతో ఏ రోజుకారోజు శుభ్రంగా కడగాలి. లేదంటే అవి మొండి మరకలుగా మారుతాయి. 
  2. స్టవ్‌ని తుడిచిన గుడ్డను సర్ఫ్‌తో వెంటనే ఉతికి ఆరేయాలి. ఇలా చేయడం వల్ల దానికి అంటుకున్న జిడ్డు పోయి బ్యాక్టీరియా చేరదు. తిరిగి ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటుంది. లేదంటే వంటగదిలోకి బ్యాక్టీరియా చేరుతుంది. 
  3. స్టవ్‌ గట్టు కడిగేటప్పుడు వాటర్‌ క్లీనర్‌తో నీరు అస్సలు లేకుండా శుభ్రంగా తుడిచేయాలి. కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ ఎప్పుడూ పొడిగా ఉండాలి.

Updated Date - 2020-08-13T05:30:00+05:30 IST