Jul 31 2021 @ 09:57AM

బుల్లితెరపై 'వకీల్ సాబ్' ఆకట్టుకోలేకపోయాడా..?

బుల్లితెరపై 'వకీల్ సాబ్' ఆకట్టుకోలేపోయాడా..? తాజాగా టీఆర్పీ రేటింగ్స్ పరిశీలిస్తే అదే అనిపిస్తోంది. రాజకీయాలలోకి వెళ్ళిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా 'వకీల్ సాబ్'. ఆయన కెరీర్‌లోనే ఇలాంటి సినిమా చేయడం మొదటిసారి. బాలీవుడ్‌లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన 'పింక్' సినిమాకి తెలుగులో అఫీషియల్ రీమేక్‌గా 'వకీల్ సాబ్' రూపొందించారు. మధ్యలో ఇదే కథ కోలీవుడ్‌లో స్టార్ హీరో అజిత్ కుమార్ చేశాడు. 'నెర్కొండ పార్వై'గా వచ్చిన ఈ సినిమాను హెచ్.వినోద్ తెరకెక్కించగా, బాలీవుడ్ మేకర్ బోనీకపూర్ నిర్మించాడు. అటు అమితాబ్, ఇటు అజిత్ క్యారెక్టర్‌ని బ్యాలెన్స్ చేస్తూ పవర్ స్టార్ ఇమేజ్‌కి తగ్గట్టుగా 'వకీల్ సాబ్‌'లో ఆయన పాత్రను డిజైన్ చేశారు డైరెక్టర్ వేణు శ్రీరామ్. పవన్ పాత్రతో పాటు నివేతా థామస్, అంజలి, అనన్య నాగళ్ల పాత్రలను కీలకంగా తీర్చి దిద్దారు.

'వకీల్ సాబ్' సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ వదిలినప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి. ఆ అంచనాలను సినిమా థియేట్రికల్ రిలీజ్ వచ్చేసరికి తారా స్థాయిలో పెంచేసింది చిత్ర బృందం. ప్రమోషన్ కూడా నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో నిర్వహించాడు. బోనీకపూర్ సమర్పణలో వచ్చిన ఈ సినిమాకి మ్యూజిక్ సెన్షేషన్ థమన్ ఇచ్చిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. అన్నీ కలిసి సినిమా ఇండస్ట్రీ హిట్ అనే టాక్ క్రియేట్ చేశాయి. దాదాపు ఏడాది ఆలస్యంగా విడుదలయింది. ఈ ఏడాది ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో 'వకీల్ సాబ్' వచ్చి సునామీని సృష్టించాడని చెప్పక తప్పదు.

కరోనా ప్యాండమిక్ పరిస్థితుల్లో కూడా థియేటర్స్ వద్ద జనాలు ఇసుక వేస్తే రాలనంతగా సందడి చేశారు. ఇది నిజంగా ఇండస్ట్రీ వర్గాలు కూడా ఊహించలేదు. అయితే కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ పడటంతో రిలీజైన కొద్దిరోజుల్లోనే థియేటర్స్ మూతపడ్డాయి. ఆ తర్వాత అమెజాన్ ప్రైంలో స్ట్రీమింగ్ చేయగా, అక్కడ కూడా ప్రేక్షకులు బాగా వీక్షించారు. ఈ క్రమంలో ఇటీవల బుల్లితెరపైకి వచ్చాడు 'వకీల్ సాబ్'. టీవీలో ప్రోమోలు ప్రసారమై బాగా హైప్ తీసుకు వచ్చాయి. అయితే సినిమా ప్రసారమయ్యాక మాత్రం షాకింగ్‌గా టీఆర్పీ రేటింగ్ నమోదయింది. ఈ సినిమా టాప్ ప్లేస్‌లో ఉంటుందనుకుంటే.. అసలు టాప్ 10లో కూడా లేకపోవడం ఆశ్చర్యకరం. ఇది కొంత పవన్ అభిమానులను డిసప్పాయింట్ చేసే అంశం అయినప్పటికీ మరో కోణంలో చూస్తే 'వకీల్ సాబ్' నమోదు చేసిన 19.12 టీఆర్పీ రేటింగ్ చెప్పుకోదగినదే అంటున్నారు. థియేటర్స్ రిలీజ్, ఆ తర్వాత అమెజాన్ లో స్ట్రీమింగ్ అయింది. అయినా కూడా బుల్లితెరపై 'వకీల్ సాబ్'కి ఈ రేంజ్‌లో టీఆర్పీ రేటింగ్ రావడం అంటే చాలా గొప్ప విషయం అంటున్నారు. 

ఇక ఇప్పటి వరకు హైయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ నమోదు చేసిన చిత్రాల లిస్ట్ ఇదే:


1) అల వైకుంఠపురములో- 29.4

2) సరిలేరు నీకెవ్వరు- 23.4

3) బాహుబలి-2- 22.7

4) శ్రీమంతుడు- 22.54

5) దువ్వాడ జగన్నాథం-21.7

6) బాహుబలి-1- 21.54

7) ఫిదా- 21.31

8) గీత గోవిందం-20.8

9) జనతా గ్యారేజ్ – 20.69

10) మహానటి- 20.21