Abn logo
Aug 1 2021 @ 20:27PM

కృష్ణానది తీర ప్రాంత గ్రామాల్లో హెచ్చరికలు

గుంటూరు: కృష్ణానది తీర ప్రాంత గ్రామాల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వచ్చే అవకాశం ఉందని, ప్రాజెక్టుకు లక్ష నుండి ఐదు లక్షల క్యూసెక్కుల నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అచ్చంపేట, అమరావతి మండల తీర గ్రామాలలో దండోరా వేసి హెచ్చరికలు జారీ చేశారు. పులిచింతల ప్రాజెక్టు, బ్యారేజి ఎగువన ఉన్న వాగుల నుంచి వరదనీరు ప్రాజెక్టులోకి వస్తోంది. వరద ఉధృతి క్రమంగా పెరిగే అవకాశం ఉందని, దిగువ ప్రాంతవాసులు మత్స్యకారులు, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

క్రైమ్ మరిన్ని...