మైలేజీ తగ్గితే...ఆర్టీసీ డ్రైవర్లకు వార్నింగ్‌ లెటర్లు

ABN , First Publish Date - 2022-05-18T07:06:28+05:30 IST

మైలేజీ (లీటరు డీజిల్‌తో బస్సు నడిచే దూరం...కేఎంపీఎల్‌) తగ్గితే డ్రైవర్లకు ప్రజా రవాణా శాఖ (పీటీడీ)/ఆర్టీసీ విశాఖ రీజియన్‌ యాజమాన్యం హెచ్చరికలు జారీచేస్తున్నది.

మైలేజీ తగ్గితే...ఆర్టీసీ డ్రైవర్లకు వార్నింగ్‌ లెటర్లు

మైలేజీ తగ్గితే...ఆర్టీసీ డ్రైవర్లకు వార్నింగ్‌ లెటర్లు

జోనల్‌ ట్రైనింగ్‌ కాలేజీకి వెళ్లి వారం పాటు శిక్షణ తీసుకోవాలని సూచనలు


ద్వారకా బస్‌స్టేషన్‌, మే 17: మైలేజీ (లీటరు డీజిల్‌తో బస్సు నడిచే దూరం...కేఎంపీఎల్‌) తగ్గితే డ్రైవర్లకు ప్రజా రవాణా శాఖ (పీటీడీ)/ఆర్టీసీ విశాఖ రీజియన్‌ యాజమాన్యం హెచ్చరికలు జారీచేస్తున్నది. ఇదే పద్ధతి కొనసాగితే జోనల్‌ ట్రైనింగ్‌ కాలేజీకి వెళ్లి వారం రోజుల పాటు శిక్షణ తీసుకోవాలని సూచిస్తున్నారు.   ప్రతి డిపోలోను, ప్రతి రూట్‌లోను కేఎంపీఎల్‌పై అధికారులు లెక్కలు కడుతున్నారు.  డీజిల్‌ రేటు పెరిగిన దృష్ట్యా ఇంధన వ్యయాన్ని తగ్గించాలని డ్రైవర్లను అధికారులు ఆదేశిస్తున్నారు. విశాఖ రీజియన్‌లో మధురవాడ, మద్దిలపాలెం, విశాఖపట్నం, వాల్తేరు, గాజువాక, స్టీల్‌ సిటీ, సింహాచలం డిపోలు ఉన్నాయి. ప్రతి డిపో నుంచి ఎక్కువ కేఎంపీఎల్‌ సాధించిన డ్రైవర్లను, తక్కువ కేఎంపీఎల్‌ సాధించిన డ్రైవర్లను ఆయా డిపోల అధికారులు గుర్తించారు. ఎక్కువ కేఎంపీఎల్‌ సాధించిన డ్రైవర్లకు  నగదు బహుమతులు అందజేస్తూ, తక్కువ కేఎంపీఎల్‌ సాధించిన డ్రైవర్లకు వార్నింగ్‌ లెటర్లు ఇస్తున్నారు. డ్రైవింగ్‌లో  మెలకువలు పాటించి ఎక్కువ కేఎంపీఎల్‌ సాధించేందుకు కృషిచేయాలని సూచిస్తున్నారు. 


జిల్లా సహకార అధికారి ఎస్‌డీ మిల్టన్‌


విశాఖపట్నం, మే 17: కేంద్ర ప్రభుత్వ విచారణ ఎదుర్కొంటున్న సహకార సొసైటీల్లో డిపాజిట్‌లు చేయవద్దని జిల్లా సహకార అధికారి ఎస్‌డీ మిల్టన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. లక్నోకు చెందిన సహారా క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ, కోల్‌కతాకు చెందిన హమారా ఇండియా క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ, భూపాల్‌కు చెందిన సహరైస్‌ యూనివర్సల్‌ మల్టీపర్పస్‌ సొసైటీ లిమిటెడ్‌ కేంద్ర ప్రభుత్వ విచారణను ఎదుర్కొంటున్నాయని వివరించారు. అందువల్ల ఆ సంస్థల్లో డిపాజిట్‌లు చేయవద్దని ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్టు ఆయన పేర్కొన్నారు. అధిక వడ్డీలకు ఆశపడి ఈ సొసైటీల్లో డిపాజిట్‌లు చేయవద్దని ఆయన సూచించారు.

Updated Date - 2022-05-18T07:06:28+05:30 IST