ప్రభుత్వ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-08-09T07:05:22+05:30 IST

ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని, తక్షణమే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలంటూ జనసేన పార్టీ నర్సీపట్నం నియోజవర్గ ఇన్‌చార్జి రాజాన వీర సూర్యచంద్ర ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సోమవారం ఆర్డీఓ భవానీ శంకర్‌కు వినతి పత్రం అందించారు.

ప్రభుత్వ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి
ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న జనసేన నాయకులు


నర్సీపట్నం అర్బన్‌, ఆగస్టు 8: ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని, తక్షణమే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలంటూ జనసేన పార్టీ నర్సీపట్నం నియోజవర్గ ఇన్‌చార్జి రాజాన వీర సూర్యచంద్ర ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సోమవారం ఆర్డీఓ భవానీ శంకర్‌కు వినతి పత్రం అందించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసినా తర్వాతనే వాటిపై అధికారులు దృష్టి సారిస్తున్నారని, ప్రభుత్వ స్థలాల్లో ముందుగానే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఏళ్ల తరబడి భూములు ఆన్‌లైన్‌ కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వూడి చక్రవర్తి, టౌన్‌ అధ్యక్షులు అద్దెపల్లి గణేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T07:05:22+05:30 IST