రెండు బీమర్లు వేసినా బౌలింగ్ ఇచ్చారని వార్నర్ ఆగ్రహం.. క్లారిటీ ఇచ్చిన కోచ్

ABN , First Publish Date - 2021-04-16T11:18:08+05:30 IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తాజాగా జరిగిన మ్యాచులో హైదరాబాద్ త్రుటిలో ఓటమిపాలైంది.

రెండు బీమర్లు వేసినా బౌలింగ్ ఇచ్చారని వార్నర్ ఆగ్రహం.. క్లారిటీ ఇచ్చిన కోచ్

హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తాజాగా జరిగిన మ్యాచులో హైదరాబాద్ త్రుటిలో ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేయడం అందరి కంటా పడింది. మ్యాచ్ చివరి ఓవర్ వేసిన హర్షల్ పటేల్ రెండు బీమర్లు వేశాడు. అయినా సరే అతను బౌలింగ్ చేయడానికి అంపైర్లు అనుమతి ఇవ్వడంతో వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై హైదరాబాద్ జట్టు కోచ్ ట్రెవర్ వివరణ ఇచ్చాడు. తొలిసారి వేసిన బీమర్ బ్యాట్స్‌మెన్ శరీరం వైపు రాలేదని, రెండోది వచ్చిందని, దీంతో హర్షల్‌కు కేవలం వార్నింగ్ ఇవ్వడం జరిగిందని ట్రెవర్ పేర్కొన్నాడు.

Updated Date - 2021-04-16T11:18:08+05:30 IST