ఐపీఎల్‌లో హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ రికార్డు

ABN , First Publish Date - 2020-10-19T02:26:11+05:30 IST

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో అరుదైన రికార్డును తన పేర లిఖించుకున్నాడు. కోల్‌కతాతో నేడు జరిగిన మ్యాచ్‌లో 33 బంతుల్లో 5 ఫోర్లతో 47 పరుగులు చేసిన

ఐపీఎల్‌లో హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ రికార్డు

అబుదాబి: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో అరుదైన రికార్డును తన పేర లిఖించుకున్నాడు. కోల్‌కతాతో నేడు జరిగిన మ్యాచ్‌లో 33 బంతుల్లో 5 ఫోర్లతో 47 పరుగులు చేసిన వార్నర్ 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐపీఎల్‌లో 5000 పరుగులు పూర్తిచేసుకున్నాడు. ఫలితంగా ఆ ఘనత సాధించిన తొలి విదేశీయుడిగా రికార్డులకెక్కాడు.


ఓవరాల్‌గా ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. అతడి కంటే ముందు విరాట్ కోహ్లీ (5,759), సురేశ్ రైనా (5,368), రోహిత్ శర్మ (5,149) ఉన్నారు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 5 వేల పరుగులు సాధించిన కోహ్లీ కంటే 22 ఇన్నింగ్స్‌ల ముందే అంటే 135 ఇన్నింగ్స్‌లలోనే వార్నర్ ఈ ఘనత సాధించడం విశేషం.

Updated Date - 2020-10-19T02:26:11+05:30 IST