టిక్‌టాక్ నిషేధంపై వార్నర్ ఏమన్నాడంటే..

ABN , First Publish Date - 2020-07-03T00:19:40+05:30 IST

చైనీస్ సోషల్ మీడియా అప్లికేషన్ టిక్‌టాక్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన..

టిక్‌టాక్ నిషేధంపై వార్నర్ ఏమన్నాడంటే..

కాన్‌బెర్రా: చైనీస్ సోషల్ మీడియా అప్లికేషన్ టిక్‌టాక్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌లో ఈ యాప్ పనిచేయకుండా పోయింది. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ నిషేధంపై పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో దీనిపై స్పందించాడు. టిక్‌టాక్ బ్యాన్‌పై తాను ఏమీ చేయలేనని, తన చేతిలో ఏమీ లేదని వార్నర్ అన్నాడు. ప్రజలు తమ ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించాలని, దానికి తగ్గట్టుగా నడుచుకోవాలని సూచించాడు.


ఇదిలా ఉంటే వార్నర్ ఇటీవల టిక్‌టాక్‌లో తెగ హల్ చల్ చేస్తున్నాడు. తెలుగు సినిమా సాంగ్స్‌కు డాన్స్‌ చేస్తూ, డైలాగులు చెబుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే టిక్‌టాక్ బ్యాన్ కారణంగా వార్నర్ ఆ అభిమానులందరికీ దూరం కానున్నాడు.

Updated Date - 2020-07-03T00:19:40+05:30 IST