వార్నర్‌ చాలెంజ్‌..

ABN , First Publish Date - 2020-04-01T09:59:17+05:30 IST

కరోనా వైరస్‌ బాధితుల ప్రాణాలు కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్న వివిధ విభాగాల వారికి మద్దతుగా ఆస్ర్టేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వినూత్న రీతిలో మద్దతు పలికాడు. ట్రిమ్మర్‌ సహాయంతో మొత్తం తల వెంట్రుకలను తొలగించి స్వయంగా గుండు

వార్నర్‌ చాలెంజ్‌..

  • కోహ్లీ.. నువ్వూ గుండు గీసుకో!

సిడ్నీ: కరోనా వైరస్‌ బాధితుల ప్రాణాలు కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్న వివిధ విభాగాల వారికి మద్దతుగా ఆస్ర్టేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వినూత్న రీతిలో మద్దతు పలికాడు. ట్రిమ్మర్‌ సహాయంతో మొత్తం తల వెంట్రుకలను తొలగించి స్వయంగా గుండు చేసుకున్నాడు. అంతేకాకుండా ఇదే తీరున చేయాల్సిందిగా విరాట్‌ కోహ్లీ, స్టీవ్‌ స్మిత్‌, కమిన్స్‌, జంపా సహా మరో నలుగురికి చాలెంజ్‌ విసిరాడు. అయితే తన హెయిర్‌స్టయిల్‌ను ప్రాణంగా చూసుకునే కోహ్లీ ఈ సవాల్‌కు స్పందించడం కష్టమే..  

Updated Date - 2020-04-01T09:59:17+05:30 IST