లాక్డౌన్ సమయంలో బాహుబలి డైలాగ్‌తో పాటు బార్యతో కలిసి బుట్టబొమ్మ సాంగ్ స్టెప్పులు కూడా వేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేశాడు ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఈ టిక్ టాక్ వీడియోలతో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మధ్యలో ఐపీఎల్ కారణంగా ఫుల్ బిజీ బిజీగా మారిపోయాడు. ఇప్పుడు ఇండియాతో త్వరలోనే స్టార్ట్ కాబోతున్న సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు ఈ గ్యాప్‌లో మరోసారి సినిమాపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు డేవిడ్ వార్నర్. 'ఇస్మార్ట్ శంకర్'లో రామ్, 'అరవిందసమేత'లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్, బిగ్‌బీ అమితాబ్ లుక్స్‌లో తానెలా ఉంటాననే విషయాన్ని వార్నర్ మార్ఫింగ్ చేసిన వీడియోలను షేర్ చేశాడు వార్నర్. ఈ పోస్టులపై నెటిజన్స్ తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు.