టీమిండియా, సిరాజ్‌కు వార్నర్‌ క్షమాపణలు

ABN , First Publish Date - 2021-01-13T10:30:52+05:30 IST

భారత ఆటగాళ్లపై జాత్యహంకార వ్యాఖ్యలను ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఖండించాడు. టీమిండియాకు క్షమాపణలు చెప్పాడు.

టీమిండియా, సిరాజ్‌కు వార్నర్‌ క్షమాపణలు

సిడ్నీ: భారత ఆటగాళ్లపై జాత్యహంకార వ్యాఖ్యలను ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఖండించాడు. టీమిండియాకు క్షమాపణలు చెప్పాడు. మూడో టెస్ట్‌లో శనివారం ఆట సమయంలో ఫీల్డింగ్‌ చేస్తున్న సిరాజ్‌, బుమ్రాను ఉద్దేశించి కొందరు ప్రేక్షకులు కించపరిచే వ్యాఖ్యలు చేశారు. రెండో రోజు కూడా సిరాజ్‌ను అదే తరహాలో అవమానించారు. టీమిండియా ఫిర్యాదుతో వివక్షపూరిత వ్యాఖ్యలు చేసిన ఫ్యాన్స్‌ను స్టేడియం నుంచి పంపించేశారు. ‘సిరాజ్‌, టీమిండియాకు క్షమాపణలు. ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కడా ఆమోదయోగ్యం కాదు. ప్రేక్షకుల నుంచి మెరుగైన ప్రవర్తనను ఆశిస్తున్నా’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో వార్నర్‌ పోస్ట్‌ చేశాడు. 


పెయిన్‌ పశ్చాత్తాపం: ఫీల్డ్‌లో తన ప్రవర్తనపై ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పెయిన్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అశ్విన్‌ను స్లెడ్జ్‌ చేసి తెలివితక్కువగా వ్యవహరించానన్నాడు. అందుకు క్షమాపణలు కోరాడు. తీవ్ర ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో ఏం చేస్తున్నానో అర్థం కాలేదని పెయిన్‌ తెలిపాడు. జట్టును సరిగా నడిపించలేకపోయానని అన్నాడు. ఈ విషయమై అశ్విన్‌తో మాట్లాడానని చెప్పాడు. 

Updated Date - 2021-01-13T10:30:52+05:30 IST