వార్డు వలంటీర్లకు చెక్‌

ABN , First Publish Date - 2021-03-07T07:03:23+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డు వలంటీర్లను దూరంగా ఉంచాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టింది.

వార్డు వలంటీర్లకు చెక్‌

వారి జోక్యం నిర్థారణైతే చర్యలు: కలెక్టర్‌ 

అమలాపురం/కాకినాడ (ఆంధ్రజ్యోతి), మార్చి 6 : మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డు వలంటీర్లను దూరంగా ఉంచాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టింది. గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ తీర్పును డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేయడంతో విచారించిన న్యాయస్థానం ఎట్టి పరిస్థితిలోను వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలని ఆదేశించింది. దాంతో జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్న పది మున్సిపాలిటీల్లో వార్డు వలంటీర్లను ఎన్నికల ప్రచారంలో పాల్గొన కుం డా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. ఆయా మున్సిపాలిటీల్లో నియమించిన వార్డు వలంటీర్లు ఎన్నికల ప్రవర్తనానియమావళికి విరుద్ధంగా ప్రచారంలో పాల్గొనడం నిషేధించారు. వలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం, పాల్గొనడం నిషేధమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డి మురళీధర్‌ రెడ్డి తెలిపారు. అలా కాకుండా వ్యవహరిస్తే తగు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వలంటీర్లు ఎన్నికల్లో ప్రచారం, పాల్గొన్నట్టు తెలిస్తే తగిన రుజువులతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఫోన్‌ నంబర్లు 08863, 2218089, 2222750లలో నేరుగా ఫిర్యాదు చేయాలన్నారు. రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలనుకుంటే ట్ఛఛిడ.్చఞట్ఛఛి2ఃజఝ్చజీజూ.ఛిౌఝ మెయిల్‌కు పంపాలన్నారు. లేదా తనకు, సంబంధిత మునిసిపల్‌ కమిషనర్‌ లకు ఫిర్యాదు చేయాలనుకుంటే 8106149123, 8106721345 నంబర్లకు ఫోన్‌ చేసి చెప్పాలన్నారు. 


Updated Date - 2021-03-07T07:03:23+05:30 IST