సర్పంచ్‌ తీరుకి నిరసనగా వార్డు సభ్యుడు రాజీనామా

ABN , First Publish Date - 2022-01-26T06:04:14+05:30 IST

గొలుగొండ మండలం సీహెచ్‌ నాగాపురం పంచాయతీ 7వ వార్డు సభ్యుడు జుర్రా లోవబాబు మంగళవారం తన పదవితోపాటు వైసీపీకి కూడా రాజీనామా చేశారు.

సర్పంచ్‌ తీరుకి నిరసనగా వార్డు సభ్యుడు రాజీనామా
సచివాలయం కార్యదర్శికి రాజీనామా పత్రం అందిస్తున్న వార్డు మెంబర్‌ లోవరాజు

50 మంది అనుచరులతో కలిసి వైసీపీకి గుడ్‌బై


కృష్ణాదేవిపేట, జనవరి 25: గొలుగొండ మండలం సీహెచ్‌ నాగాపురం పంచాయతీ 7వ వార్డు సభ్యుడు జుర్రా లోవబాబు మంగళవారం తన పదవితోపాటు వైసీపీకి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని సచివాలయ కార్యదర్శి అందజేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, దళితుడైన తనపట్ల పంచాయతీ సర్పంచ్‌ రఘురామ్‌ చిన్నచూపు చూస్తున్నారని, ‘నా అనుమతి లేకుండా ఎంపీపీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యేలను కలుస్తావా?’ అంటూ అందరి ముందూ ప్రశ్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మనోభావాలను దెబ్బతీసేలా సర్పంచ్‌ మాట్లాడారని, ఇందుకు నిరసనగా వార్డు పదవికి రాజీనామా చేశానని చెప్పారు. అంతేకాక తనతోపాటు మరో 50 మంది వైసీపీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.


Updated Date - 2022-01-26T06:04:14+05:30 IST