వరంగల్: జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వర్సిటీలో నెలకొన్న సమస్యలను విద్యార్థులను అడిగి నాయిని తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వర్సిటీలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. ఒక్కో హాస్టల్ గదిలో పదిమంది విద్యార్థులు ఉంటున్నారని తెలిపారు. యూనివర్సిటీలో సమస్యలు వెంటనే పరిష్కరించాలని నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.