వరంగల్: మార్నింగ్ వాకింగ్‌లో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఖిలావరంగల్ కోటలో వేపపుల్లలు తెంపడానికి ప్రయత్నించిన ఇద్దరు వాకర్స్ కోటమీద నుండి కిందపడిపోయారు. ఈ ఘటనలో విశ్రాంత ఉద్యోగి(ఫైర్ మెన్) సొమప్ప అక్కడికక్కడే మృతి చెందగా... లక్ష్మీ నారాయణ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.