Warangal: ఇరువర్గాల మధ్య ఘర్షణ... ఏడుగురికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2022-06-25T13:58:10+05:30 IST

జిల్లాలోని రాయపర్తి మండలం సూర్యతండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూతగాదాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.

Warangal: ఇరువర్గాల మధ్య ఘర్షణ... ఏడుగురికి తీవ్ర గాయాలు

వరంగల్: జిల్లాలోని రాయపర్తి మండలం సూర్యతండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూతగాదాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు మారణాయుధాలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-25T13:58:10+05:30 IST