కాళోజీ హెల్త్ వర్సిటీ పీజీ సీట్ల బ్లాక్ దందాపై వీసీ స్పందన

ABN , First Publish Date - 2022-04-19T19:17:00+05:30 IST

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పీజీ సీట్ల బ్లాక్ దందాపై వీసీ ప్రవీణ్ కుమార్ స్పందించారు.

కాళోజీ హెల్త్ వర్సిటీ పీజీ సీట్ల బ్లాక్ దందాపై వీసీ స్పందన

వరంగల్: కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పీజీ సీట్ల బ్లాక్ దందాపై వీసీ ప్రవీణ్ కుమార్ స్పందించారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 33 మెడికల్ కాలేజీలు ఉన్నాయన్నారు. వీటిలో 09 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 20 ప్రైవేటు మెడికల్ కాలేజీలు, 04 మైనారిటీ మెడికల్ కాలేజీలు ఉన్నాయని తెలిపారు. ఈ కాలేజీల పరిధిలో మొత్తం 2295 పీజీ సీట్లు ఉన్నాయన్నారు. వీటిలో కన్వీనర్ కోటా 1090, ఆల్ ఇండియా కోటా 512, మేనేజ్మెంట్ కోటా 693 సీట్లు ఉన్నాయని వీసీ తెలిపారు. 40కి పైగా పీజీ సీట్లలో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. స్ట్రే వెకెన్సీ ఆప్షన్‌ను ఆధారంగా చేసుకొని యాజమాన్యాలు సీట్లు బ్లాక్ చేస్తున్నాయని తెలిపారు. రెండు కోట్ల రూపాయలకు పైగా ఒక్కో సీటు అమ్మకం జరిగిందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. మరోవైపు పీజీ సీట్ల బ్లాక్ దందాపై వరంగల్ పోలీస్ కమిషనర్‌కు కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో పీజీ సీట్ల వ్యాపారం పోలీసులు కూపీ లాగుతున్నారు. 

Updated Date - 2022-04-19T19:17:00+05:30 IST