Warangal: టెస్కో గోదాంలో అదుపులోకి రాని మంటలు

ABN , First Publish Date - 2022-04-12T13:43:51+05:30 IST

జిల్లాలోని టెస్కోగోదాంలో మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది.

Warangal: టెస్కో గోదాంలో అదుపులోకి రాని మంటలు

వరంగల్: జిల్లాలోని టెస్కోగోదాంలో మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. 7 ఫైర్ ఇంజన్‌లతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మంటలకు గోదాంలోని దుస్తులు కాలిబూడిదవుతున్నాయి. నిన్న సాయంత్రం గీసుకొండ మండలం ధర్మారంలోని ప్రభుత్వ గోదాంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు రూ.38 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. 

Updated Date - 2022-04-12T13:43:51+05:30 IST