కన్నతల్లిని చూడనీయకుండా అడ్డుపడుతున్న కరోనా నిబంధనలు.. సాయం కోసం కొడుకు ఎదురుచూపు

ABN , First Publish Date - 2022-01-28T01:08:48+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తుండంతో ఆంక్షలు అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఆంక్షలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కన్నతల్లిని చూసేందుకు పరితపిస్తున్న కొడుక్కి అడ్డంకిగా మారాయి.

కన్నతల్లిని చూడనీయకుండా అడ్డుపడుతున్న కరోనా నిబంధనలు.. సాయం కోసం కొడుకు ఎదురుచూపు

ఎన్నారై డెస్క్: కరోనా మహమ్మారి విజృంభిస్తుండంతో ఆంక్షలు అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఆంక్షలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కన్నతల్లిని చూసేందుకు పరితపిస్తున్న కొడుక్కి అడ్డంకిగా మారాయి. దిక్కుతోచని స్థితిలో తనకు సాయం చేయాలంటూ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా అభ్యర్థించాడు. తన పరిస్థితిని వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



వరంగల్‌కు చెందిన ఎం వినయ్‌రెడ్డి ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు కెనడా సిటిజన్‌షిప్ ఉంది. కాగా.. వినయ్‌రెడ్డి తల్లి కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విషయం వినయ్‌రెడ్డికి తెలియడంతో.. ఇండియాకు వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే.. కరోనా ఆంక్షల కారణంగా కెనడియన్ సిటిజన్లకు భారత ప్రభుత్వం ఈవీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలుసుకుని షాకయ్యారు. ఈ క్రమంలోనే తన తల్లి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్‌ను జత చేస్తూ సాయం చేయాల్సిందిగా  మంత్రి కేటీఆర్‌ను కోరారు. వినయ్‌రెడ్డి విన్నపానికి మంత్రి కేటీఆర్ స్పందించారు. అంతేకాకుండా వినయ్‌రెడ్డి బాధను విదేశాంగ మంత్రి జైశంకర్‌‌ దృష్టికి తీసుకెళ్లారు. అర్జెంటుగా వీసా వచ్చే ఏర్పాటు చేయాలని ట్విట్టర్ ద్వారా కోరారు. 






Updated Date - 2022-01-28T01:08:48+05:30 IST