ఉమ్మడి Warangal జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం

ABN , First Publish Date - 2022-07-09T15:01:09+05:30 IST

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

ఉమ్మడి Warangal జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షాలకు పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాటారం- మేడారం వెళ్లే మార్గ మధ్యలోని నిమ్మగూడెం వద్ద   పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. కాటారం మండలం శంకరంపల్లిలో  వరదనీరు ఇళ్లలోకి చేరింది.


లక్ష్మీ బ్యారేజ్ 35 గేట్లు ఎత్తివేత

అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు రోజుల నుంచి  వర్షం కురుస్తోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. లక్ష్మీ బ్యారేజి ఇన్ ఫ్లో :1,15,860 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 1,41,550 క్యూసెక్కులుగా ఉంది. అలాగే లక్ష్మీ బ్యారేజీ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిలువ 5.981 టీఎంసీలకు చేరింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అధికారులు బ్యారేజీ 35 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 


అన్నారం(సరస్వతీ) బ్యారేజీ ఇన్‌ఫ్లో 10200 క్యూసెక్కులు

మరోవైపు అన్నారం(సరస్వతీ)బ్యారేజీలో వరద ఉధృతి కొనసాగుతోంది. బ్యారేజీ ఇన్ ఫ్లో 10200 క్యూసెక్కులు,  ఔట్ ఫ్లో 10200 క్యూసెక్కులుగా ఉంది పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిలువ : 5.69 టీఎంసీలుగా నమోదు అయ్యింది. వరద  నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అధికారులు 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 


జిల్లాలో వ్యాప్తంగా నమోదైన వర్షపాతం

వరంగల్ జిల్లా ఖానాపూర్ లో 98 మి.మీ.లు 

మహబూబాబాద్ జిల్లా గూడూరులో 92.3 మి.మీ.లు

భూపాలపల్లి జిల్లా కాటారంలో 84మి.మీ.లు

హనుమకొండ జిల్లా పరకాలలో 82.8 మి.మీ.లు

ములుగు జిల్లా వెంకటాపురంలో 68 మి.మీ.లు

జనగామ జిల్లా తరిగొప్పులలో 45.8 మి.మీ.లు వర్షపాతం నమోదు అయ్యింది.

Updated Date - 2022-07-09T15:01:09+05:30 IST