వరంగల్: నర్సంపేట మండలం ఉప్పల్ తండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు వెళ్లిన మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, నిరంజన్ రెడ్డిని అడ్డుకునేందుకు కొందరు రైతుల యత్నించారు. వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. మంత్రులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు. పంట నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకోవాలని మంత్రులకు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి