నిలిచిన ఈ-పీవోఎస్‌ మిషన్ల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-21T05:45:26+05:30 IST

నిలిచిన ఈ-పీవోఎస్‌ మిషన్ల పంపిణీ

నిలిచిన ఈ-పీవోఎస్‌ మిషన్ల పంపిణీ

వరంగల్‌టౌన్‌, జనవరి 20: ఏనుమాముల వ్యవ సాయ మార్కెట్లో గురువారం ఆ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి రాహుల్‌ మార్కెట్‌ దడవాయిలకు ఎల క్ర్టానిక్‌ ప్రింట్‌ ఆపరేటివ్‌ సేల్స్‌(ఈ- పీవోఎస్‌) మిష న్లను అందించేందుకు ఏర్పాటు చేశారు. దీనికి సం బంధించి దడవాయి యూనియన్‌ అధ్యక్షుడు మార్త శ్యాంసుందర్‌తో పాటు దడువాయిలందరినీ స్టోర్‌ రూంకి పిలిపించారు. ఈ-పీవోఎస్‌ మిషిన్లను అందిం చే క్రమంలో మిషన్‌కు ఆపరేటింగ్‌కు సంబంధించిన ఆర్‌సీ కేబుల్‌ లేకపోవడంతో దడవా యిలు వాటిని తీసుకునేందుకు నిరాక రించారు. దీంతో శుక్రవారం లేదా సోమవారం మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ చే తుల మీదుగా ఈ పీవోఎస్‌ మిషన్లను పంపిణీ చేసేందుకు కార్య దర్శి రాహుల్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

ఈ- పీవోఎస్‌ మిషన్ల  ద్వారా తూకం వేయడంతో ఖచ్చితమైన  సమాచారం, రైతు పేరు, ఊ రు, సరు కు పేరు, అడ్తి పేరు, ఖరీదు పేరు, ధర, అన్ని వివరా లు అప్పటికప్పుడు రైతు కు ప్రింటు రూపంలో ఇవ్వవచ్చు. మరోపక్క ఈ పీవోఎస్‌ మిషన్‌ సిమ్‌కార్డతో పనిచే స్తుంది. ఆన్‌లైన్‌ ద్వారా ప్రధాన కార్యాలయా నికి అనుసం ధానమై ఉంటుంది. తద్వారా మార్కెట్లో జరిగే ప్రతీ విక్రయం ఆన్‌లైన్‌ ద్వారా ప్ర ధాన కార్యాలయంలో సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. మార్కెట్‌ ఫీజు చెల్లించకుండా (జీరో) వ్యాపారం జరిగే అవకాశం లేకుండా పోతుంది. 

ఈ- పీవోఎస్‌ మిషన్ల పంపిణీలో జాప్యం 

మార్కెట్లో ఈ - పీవోఎస్‌ మిషన్ల పంపిణీ జరగా ల్సి ఉన్నప్పటికినీ గత రెండేళ్లుగా జాప్యం జరుగుతూ వస్తుంది. శాంపిల్‌గా పది మిషన్లను తెలప్పించారు. కొన్ని రోజులు వాటితో దడవాయిలకు శిక్షణ ఇప్పించా రు. ఆ తర్వాత విషయాన్ని వదిలేశారు. ఇటీవల రైతు సంఘాలు ఈ పీవోఎస్‌ మిషన్ల వాడాలని ఉన్నతాఽ దికారులకు ఫిర్యాదులు చేయడంతో మిషన్ల పంపి ణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-21T05:45:26+05:30 IST