Abn logo
Jan 13 2021 @ 12:47PM

వరంగల్: డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో ఉద్రిక్తత

వరంగల్: జిల్లాలోని రాయపర్తి మండలం మైలారం గ్రామంలో 50 డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబ్బులు తీసుకొని ఇళ్లు ఉన్నవాళ్లే ఇండ్లు ఇస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 150 మంది రూ.5 వేలు ఇచ్చి కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఇచ్చిన భూముల్లో అందరికీ డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని చెప్పి కేవలం 20  మందికే ఇచ్చారని మండిపడ్డారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే రాయపర్తిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి ఎర్రబెల్లి  ప్రారంభించారు. 

Advertisement
Advertisement
Advertisement