వరంగల్ జిల్లా: జీవో 317 కారణంగా వరంగల్‌లో మరో ఉపాధ్యాయుడు బలయ్యాడు. స్థానికత పోతోందన్న మనస్తాపంతో ఉప్పల రమేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రమేష్ వరంగల్ జిల్లా నుంచి ములుగు జిల్లాకు బదిలీ అయ్యాడు. ఇప్పటికే వరంగల్ జిల్లాలో ఇద్దరు టీచర్లు చనిపోగా రమేష్ మూడో ఉపాధ్యాయుడు. నర్సంపేట చంద్రయ్యపల్లికి చెందిన ఉప్పల రమేష్ ఖానాపూర్ మండలం, ధర్మారావుపేట, బాల్ తండాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడి నుంచి ములుగు జిల్లాకు బదిలీ కావడంతో స్థానికత పోతుందని, తీవ్ర మనస్తాపానికిలోనై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.