వరంగల్: నగరంలోని రైతుల నిరసన ఉద్రిక్తతగా మారింది. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలోకి రైతులు చొచ్చుకళ్లారు. మిర్చి ధర తగ్గిందంటూ రైతులు ఆందోళన చేపట్టారు. తేజ మిర్చికి రూ. 17,200 పలికితే... రూ. 14 వేల లోపే కొనుగోలు చేస్తున్నారని రైతులు మండిపడుతూ ఆందోళనకు దిగారు. ఒకానొక దశలో మిర్చి యార్డు కార్యాలయంలోకి దూసుకెళ్లిన రైతులు... అక్కడ సామాగ్రిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. దళారుల దందా అరికట్టి, రైతులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.